Begin typing your search above and press return to search.

డబుల్ ఇస్మార్ట్‌ తర్వాత యూటర్న్‌...!

ఎనర్జిటిక్ స్టార్‌ రామ్‌ మరోసారి కెరీర్ లో కాస్త ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నాడు. ఆయన నటించిన ది వారియర్ మరియు స్కంద సినిమాలు బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశ పరిచాయి.

By:  Tupaki Desk   |   4 Jan 2024 5:09 AM GMT
డబుల్ ఇస్మార్ట్‌ తర్వాత యూటర్న్‌...!
X

ఎనర్జిటిక్ స్టార్‌ రామ్‌ మరోసారి కెరీర్ లో కాస్త ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నాడు. ఆయన నటించిన ది వారియర్ మరియు స్కంద సినిమాలు బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశ పరిచాయి. దాంతో ఇప్పుడు ఆయన చేస్తున్న 'డబుల్ ఇస్మార్ట్‌' పైనే అందరి దృష్టి ఉంది.

పూరి జగన్నాద్‌ దర్శకత్వంలో రామ్‌ నటించిన ఇస్మార్ట్‌ శంకర్ మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ఈ డబుల్ ఇస్మార్ట్‌ మూవీ కి సహజంగానే పాజిటివ్ బజ్‌ క్రియేట్‌ అయింది. ఇద్దరికి కూడా ఈ సినిమా విజయం అత్యంత కీలకంగా మారింది అనడంలో సందేహం లేదు.

రామ్‌ తన తదుపరి సినిమాలకు సంబంధించిన చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం రామ్‌ తన తదుపరి సినిమా కోసం కాస్త క్లాస్ టచ్ ఉన్న స్క్రిప్ట్‌ లను పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది.

చాలా రోజుల తర్వాత రామ్‌ నుంచి ఒక లవ్ స్టోరీ సినిమా వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. రామ్‌ నుంచి ఈ మధ్య కాలంలో ఆయన ఇమేజ్ కి తగ్గట్లుగా మంచి స్క్రిప్ట్‌ ను ఎంపిక చేసుకోలేక పోతున్నాడు అంటూ ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అందుకే రామ్‌ ఈసారి యూటర్న్ తీసుకుని కథ ఎంపిక చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. డబుల్ ఇస్మార్ట్‌ తర్వాత కచ్చితంగా రామ్‌ నుంచి విభిన్నమైన సినిమా వస్తుందని ఆయన సన్నిహితులు ఆఫ్‌ ది రికార్డ్‌ చెబుతున్నారు. ఆ విభిన్నమైన సినిమా ఏంటి అనేది చూడాలి.