Begin typing your search above and press return to search.

ఈ ప్లానింగ్ కరెక్ట్ కాదు చరణ్ అన్న

కాని మెగా అభిమానులు మాత్రం ఏడాదికి కనీసం రెండు సినిమాలు అయిన వస్తే బాగుంటుంది అని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   29 Nov 2023 4:20 AM GMT
ఈ ప్లానింగ్ కరెక్ట్ కాదు చరణ్ అన్న
X

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ తర్వాత ఇప్పటి వరకు ఆచార్య మూవీతోనే ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది. అయితే ఆర్ఆర్ఆర్ అయిపోయిన తర్వాత కచ్చితంగా ప్రతి ఏడాది ఒకటి, రెండు సినిమాలు ఉండేలా చూసుకుంటానని చెప్పారు. కాని ఈ ఏడాదిలో రామ్ చరణ్ నుంచి ఒక్క సినిమా కూడా రాలేదు.

ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. గత ఏడాది ప్రారంభమైన శంకర్ చాలా నెమ్మదిగా ఈ సినిమా చేస్తున్నారు. షెడ్యూల్ షెడ్యూల్ కి చాలా గ్యాప్ వచ్చేస్తోంది. ఈ టైంలో వేరే మూవీ చేయడానికి స్కోప్ ఉన్న కూడా చరణ్ పట్టాలు ఎక్కించే ప్రయత్నం చేయలేదు. బుచ్చిబాబు దర్శకత్వంలో RC 16కి చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

అయితే ఆ సినిమాలో రామ్ చరణ్ లుక్, ఆహార్యం కంప్లీట్ డిఫరెంట్ గా ఉండాలి. వింటేజ్ స్టైల్ లో గ్రామీణ నేపథ్యంలో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో కథ ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్లుగానే రూపం ఉండాలి. గేమ్ చేంజర్ చేస్తూ అది చేయడం కష్టం అవుతుంది. అందుకే గ్యాప్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే బుచ్చిబాబు సినిమాని కాస్త వెనక్కి తీసుకెళ్ళి ఇంకేదైన ప్రాజెక్ట్ చేసి ఉంటే బాగుండేది అనే టాక్ వినిపిస్తోంది.

చరణ్ మాత్రం ప్రాజెక్ట్స్ విషయం ఎలాంటి తొందర పడకుండా స్లో ఫేజ్ లోనే వెళ్తున్నారు. కాని మెగా అభిమానులు మాత్రం ఏడాదికి కనీసం రెండు సినిమాలు అయిన వస్తే బాగుంటుంది అని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. గేమ్ చేంజర్ రిలీజ్ తర్వాత అయిన చరణ్ తన సినిమాల ప్లానింగ్ విషయంలో మార్పులు చేసుకుంటారా లేదంటే అలాగే వెళ్తారా అనేది ఇప్పుడు చూడాలి.

ఏదేమైనా కూడా ఫ్యాన్స్ ఈ ప్లానింగ్ కరెక్ట్ గా లేదన్నా అంటూ సోషల్ మీడియాలో ఆవేదన చెందుతున్నారు. ఇక బుచ్చిబాబు దర్శకత్వంలో సినిమా మాత్రం వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్ళే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అయ్యింది. త్వరలో దీనిపై ఒక క్లారిటీ రావొచ్చు.