Begin typing your search above and press return to search.

చైతూ ప్రాజెక్ట్ ఆ హీరో వద్దకు వెళ్లిందా?

టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య.. ఇప్పుడు NC24 ప్రాజెక్ట్ తో ఫుల్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   26 Jun 2025 4:55 PM IST
చైతూ ప్రాజెక్ట్ ఆ హీరో వద్దకు వెళ్లిందా?
X

టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య.. ఇప్పుడు NC24 ప్రాజెక్ట్ తో ఫుల్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. రీసెంట్ గా తండేల్ మూవీతో సూపర్ హిట్ అందుకున్న ఆయన.. రూ.100 కోట్ల హిట్ ను సొంతం చేసుకున్నారు. స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇచ్చారు. ప్రస్తుతం కార్తీక్ దండు దర్శకత్వంలో మైథలాజికల్ మూవీలో లీడ్ రోల్ లో నటిస్తున్నారు.

ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ కు సూపర్ రెస్పాన్స్ రాగా.. సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. విరూపాక్షతో భారీ హిట్ అందుకున్న కార్తీక్ తీస్తుండడంతో అంతా హోప్స్ పెట్టుకున్నారు. అయితే ఇది చైతూ కెరీర్ లో 24వ సినిమా కాగా.. ల్యాండ్ మార్క్ మూవీని కిషోర్ అనే కొత్త ద‌ర్శ‌కుడితో చైతూ చేస్తారని ఇప్పటికే టాక్ వచ్చింది.

కిషోర్ చెప్పిన క‌థ చైత‌న్య‌కు బాగా న‌చ్చ‌డంతో సినిమా చేసేందుకు సిద్ధమయ్యారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. బాహుబలి నిర్మాతలు ఆర్కా మీడియా వర్క్స్ రూపొందిస్తుందని, టాలీవుడ్ నటుడు రానా దగ్గుబాటి సమర్పకుడిగా వ్యవహరిస్తారని వార్తలు వినిపించాయి. త్వరలో అధికారిక ప్రకటన రానుందని టాక్ వచ్చింది.

కానీ ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ను నాగచైతన్య తప్పుకున్నారని తెలుస్తోంది. కొన్ని కారణాల వల్ల తాను డ్రాప్ అవుతున్నట్లు నిర్మాతలకు ఆయన చెప్పేశారని సమాచారం. దీంతో ఆ సినిమా స్టోరీని ఎనర్జిటిక్ స్టార్ రామ్ కు డైరెక్టర్ కిషోర్ రీసెంట్ గా నెరేట్ చేశారని వినికిడి. కథ మొత్తం విన్న రామ్.. సానుకూలంగా స్పందించారట. స్టోరీ బాగా నచ్చిందని చెప్పారట.

అలా రామ్ దాదాపు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. ప్రస్తుతం తుది చర్చలు జరుగుతున్నాయని సమాచారం. త్వరలోనే మేకర్స్ అధికారిక ప్రకటన వెలువరించనున్నారని వినికిడి. అయితే ఇప్పుడు రామ్.. మహేష్ బాబు. పి దర్శకత్వంలో ఆంధ్రా కింగ్ తాలూకా మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ జరుగుతోంది.

భాగ్యశ్రీ బొర్సే హీరోయిన్ గా నటిస్తుండగా.. ఉపేంద్ర కీలక పాత్ర పోషిస్తున్నారు. ఫ్యాన్ బయోపిక్ గా రానున్న ఆ మూవీ గ్లింప్స్ రీసెంట్ గా రిలీజ్ అయ్యి సాలిడ్ రెస్పాన్స్ అందుకుంది. ఆడియన్స్ లో పాజిటివ్ బజ్ క్రియేట్ చేసింది. అయితే ఆ మూవీ షూటింగ్ పూర్తి చేసి.. కిషోర్ మూవీని రామ్ స్టార్ట్ చేయనున్నారని తెలుస్తోంది. మరి ఆ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో వేచి చూడాలి.