రామ్ 23 'క' కుర్రాళ్లతోనా?
దీంతో కొంత కాలంగా ఆ పాలసీని పక్కనబెట్టాడు. తాజాగా రామ్ కి `క` ద్వయం సుజిత్-సందీప్ లు ఓ స్టోరీ నేరెట్ చేసారట.
By: Tupaki Desk | 26 April 2025 6:59 AMఎనర్జిటిక్ స్టార్ రామ్ ని పరాజయాలు వెంటాడుతున్నాయి. `ఇస్మార్ట్ శకంర్` తో బౌన్స్ బ్యాక్ అయ్యాడనుకునే లోపు వరుసగా ఐదు ప్లాప్ లతో మళ్లీ ఖాతా తెరిచాడు. దీంతో రామ్ కి సక్సెస్ అత్యంత కీలకంగా మారింది. ప్రస్తుతం తన 22వ చిత్రం ఆన్ సెట్స్ లో ఉంది. మహేష్ బాబు. పి దర్శకత్వం వహిస్తున్నాడు. డైరెక్టర్ గా ఇతడికి గొప్ప ట్రాక్ రికార్డు ఏం లేదు. కంటెంట్ నచ్చడంతో రామ్ అవకాశం ఇచ్చాడు.
ఈ సినిమాపై రామ్ అంచనాలు భారీగానే పెట్టుకున్నాడు. సక్సస్ తో బౌన్స్ బ్యాక్ అవ్వాలని సీరియస్ గా ఉన్నాడు. సినిమా కోసం రేయింబవళ్లు శ్రమిస్తున్నాడు. అయితే ఈ సినిమా సెట్స్ లో ఉండగానే రామ్ నవతరం మేకర్లను కూడా లైన్ లో పెడుతున్నాడు. కథలు నచ్చితే కొని పెట్టుకోవడం అన్నది రామ్ కి ఎప్పటి నుంచో ఉన్న అలవాటు. చాలా సినిమాలకు ఇలా చేసాడు. కానీ అది పెద్దగా కలిసి రాలేదు.
దీంతో కొంత కాలంగా ఆ పాలసీని పక్కనబెట్టాడు. తాజాగా రామ్ కి `క` ద్వయం సుజిత్-సందీప్ లు ఓ స్టోరీ నేరెట్ చేసారట. ఇది డిఫరెంట్ స్టోరీ అని సమాచారం. స్టోరీ నచ్చడంతో రామ్ కూడా ఒకే చెప్పాడని వినిపిస్తుంది. 22వ సినిమా తర్వాత 23వ ప్రాజెక్ట్ గా ఇదే పట్టాలెక్కతుందని తెలుస్తోంది. `క` తో దర్శక ద్వయానికి మంచి పేరొచ్చిన సంగతి తెలిసిందే. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కించిన `క` బ్లాక్ బస్టర్ అయింది.
నిర్మాతలకు భారీ లాభాలు తెచ్చి పెట్టిన చిత్రంగా నిలిచింది. దీంతో ఆ ద్వయానికి అవకాశాలు బాగానే వస్తున్నాయి. అయితే ఏ హీరోకి కమిట్ మెంట్ ఇవ్వకుండా రామ్ కోసమే అప్రోచ్ అవ్వడం విశేష. ఇలాంటి డైరెక్టర్ల అవసరం ఇప్పుడు రామ్ కి అంతే అవసరం. ఇప్పటికే రామ్ ట్యాలెంట్ కి టైర్ వన్ లీగ్ లో చేరాలి. కానీ వైఫల్యాలతో ఆ స్థానికి దూరమవుతున్నాడు. వరుసగా ఐదారు సక్సెస్ లు పడితే తప్ప సాధ్యం కాదు.