అమెరికాలో రెండు మాస్ సినిమాల పేర్లు గట్టిగా వినిపించాయి: రామ్
రామ్ పోతినేని సినిమాల్లో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆయన కేవలం ఒక జోనర్ కే పరిమితం కారు. మాస్, క్లాస్, లవ్, యాక్షన్.. ఇలా అన్ని రకాల కథలను టచ్ చేస్తుంటారు.
By: Tupaki Desk | 3 Dec 2025 9:48 AM ISTరామ్ పోతినేని సినిమాల్లో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆయన కేవలం ఒక జోనర్ కే పరిమితం కారు. మాస్, క్లాస్, లవ్, యాక్షన్.. ఇలా అన్ని రకాల కథలను టచ్ చేస్తుంటారు. అయితే రీసెంట్ గా 'ఆంధ్ర కింగ్ తాలూకా' సక్సెస్ మీట్ లో రామ్ ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. తాను అమెరికా వెళ్లినప్పుడు అక్కడ, తన సినిమాల గురించి ఆడియెన్స్ రెస్పాన్స్ ఎలా ఉందనే దానిపై క్లారిటీ ఇచ్చారు.
సాధారణంగా మాస్ సినిమాలు చేస్తేనే క్లిక్ అవుతారని చాలామంది అనుకుంటారు. కానీ రామ్ అభిప్రాయం వేరు. తాను అమెరికాలో పర్యటించినప్పుడు, ప్రతి స్క్రీన్ లోనూ రెండు సినిమాల పేర్లు గట్టిగా వినిపించాయట. ఆ రెండూ ఒకదానికి ఒకటి సంబంధం లేని సినిమాలు. అవేంటో గెస్ చేయండి అంటూ ఆయనే చెప్పారు. అవి మరేవో కాదు.. జగడం, ఇస్మార్ట్ శంకర్.
ఇన్నేళ్ల తర్వాత కూడా జనాలు 'జగడం' సినిమాను గుర్తుపెట్టుకుని మాట్లాడుతుండటం చూసి రామ్ ఆశ్చర్యపోయారట. ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు పెద్దగా ఆడకపోయినా, కల్ట్ క్లాసిక్ గా నిలిచిపోయిందని ఈ సంఘటన రుజువు చేసింది. అలాగే 'ఇస్మార్ట్ శంకర్' మాస్ మేనియా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ రెండు సినిమాలు తన కెరీర్ లో ఎంత స్పెషలో, ఆడియెన్స్ మైండ్ లో ఎంత స్ట్రాంగ్ గా రిజిస్టర్ అయ్యాయో రామ్ అర్థం చేసుకున్నారు.
రామ్ కు ఉన్న పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే.. ప్రేక్షకులు ఆయన్ని అన్ని రకాల పాత్రల్లో యాక్సెప్ట్ చేయడం. దేవదాస్ లాంటి లవ్ స్టోరీ చేసినా, జగడం లాంటి రా యాక్షన్ చేసినా, కందిరీగ లాంటి కామెడీ చేసినా, ఇస్మార్ట్ శంకర్ లాంటి ఊర మాస్ చేసినా.. జనాలు ఆదరించారు. నేను శైలజకు, 'ఇస్మార్ట్ శంకర్'కు ఎంత వైవిధ్యం ఉందో మనకు తెలిసిందే. ఇలాంటి ఎక్స్ట్రీమ్స్ ను బ్యాలెన్స్ చేయడం అందరికీ సాధ్యం కాదు.
తెలుగు ఆడియెన్స్ గొప్పతనం అదేనని రామ్ అంటున్నారు. ఏ జోనర్ అయినా సరే, కథలో దమ్ముంటే, సినిమా కరెక్ట్ గా ఉంటే కచ్చితంగా చూస్తారని ఆయన నమ్మకం. అందుకే తాను ఒకే రకమైన మూసలో ఇరుక్కోకుండా, ప్రయోగాలు చేస్తూనే ఉంటానని క్లారిటీ ఇచ్చారు. ఒక జోనర్ ను పట్టుకుని వేలాడటం తనవల్ల కాదని స్పష్టం చేశారు.
మొత్తానికి రామ్ మాటలను బట్టి చూస్తుంటే, ఆయన భవిష్యత్తులోనూ ఇలాంటి వైవిధ్యమైన సినిమాలతోనే మన ముందుకు వస్తారని అర్థమవుతోంది. 'ఆంధ్ర కింగ్'తో ఎమోషనల్ గా టచ్ చేసిన రామ్, నెక్స్ట్ ఎలాంటి సర్ ప్రైజ్ ఇస్తారో చూడాలి.
