RAPO 22: ఇది నెవ్వర్ బిఫోర్ బయోపిక్.. గ్లింప్స్ టైమ్ సెట్టయ్యింది!
టాలీవుడ్ హీరో, ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని.. ఇప్పుడు యంగ్ డైరెక్టర్ మహేష్ బాబు.పి దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 14 May 2025 7:04 AMటాలీవుడ్ హీరో, ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని.. ఇప్పుడు యంగ్ డైరెక్టర్ మహేష్ బాబు.పి దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. మిస్టర్ బచ్చన్ బ్యూటీ భాగ్యశ్రీ బొర్సే హీరోయిన్ గా నటిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి భారీ బడ్జెట్ తో సినిమాను నిర్మిస్తున్నారు.
ఇప్పటికే రామ్, భాగ్యశ్రీ పాత్రలు పరిచయం చేశారు మేకర్స్. ఫస్ట్ లుక్స్ ను కూడా రిలీజ్ చేశారు. సినిమాలో సాగర్ గా రామ్.. మహాలక్ష్మిగా భాగ్యశ్రీ నటిస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే వారి లుక్స్ కు మంచి రెస్పాన్స్ రాగా, మూవీపై మంచి బజ్ క్రియేట్ అయింది. అదే సమయంలో రీసెంట్ గా మరో అప్డేట్ ఇచ్చిన విషయం తెలిసిందే.
కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర యాక్ట్ చేస్తున్నట్లు తెలిపారు. అందని వాడు మన అందరి వాడు సూర్య కుమార్ అంటూ పోస్టర్ రిలీజ్ చేశారు. ఆయనది సినిమాలో కీలక పాత్రగా ఇప్పటికే సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. సూర్యకుమార్ రోల్ చాలా స్టైలిష్ గా ఉండనున్నట్లు మేకర్స్ కూడా ప్రకటించారు.
ఇప్పుడు మరో అప్డేట్ ఇచ్చారు. మే 15వ తేదీన.. అంటే రేపు రామ్ పుట్టినరోజు సందర్భంగా సినిమా టైటిల్ గ్లింప్స్ ను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఉదయం 10.08 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. దీంతో గురువారం ఉదయం.. అటు టైటిల్.. ఇటు స్పెషల్ గ్లింప్స్ రెండూ సందడి చేయనున్నాయి
అదే సమయంలో స్పెషల్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. చాలా కూల్ మోడ్ తో ఉన్న పోస్టర్ లో చిన్న బాలుడు నడుస్తూ కనిపిస్తున్నాడు. ఓ పెద్ద హీరో కటౌట్ ఉన్నట్లు తెలుస్తుండగా.. వాతావరణం కోలాహలంగా ఉంది. ఫ్యాన్ బయోపిక్ అంటూ క్రేజీగా మేకర్స్ రైటప్ ఇచ్చారు. దీంతో ఇప్పుడు పోస్టర్ సోషల్ మీడియాలో హాట్ టాపికైంది.
సినిమాలో రామ్ మధ్యతరగతి వ్యక్తిగా.. సూపర్ స్టార్ ఉపేంద్ర అభిమాని పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోందని అంతా చెబుతున్నారు. మూవీపై అప్పుడే మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయని అంటున్నారు. అదే సమయంలో మేకర్స్.. ఇప్పటికే ఆంధ్రకేసరి టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే మరికొద్ది గంటల్లో అప్డేట్ వచ్చాక చూడాలి గ్లింప్స్ ఎలా ఉంటుందో.. టైటిల్ ఏం పెడతారో..