Begin typing your search above and press return to search.

రామ్ కు '6' ఆఫర్స్.. నెక్స్ట్ ఎవరితో మరి?

టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేనికి ఎలాంటి క్రేజ్ అందరికీ తెలిసిందే.

By:  Tupaki Desk   |   5 Jun 2025 3:15 PM IST
Ram Pothineni’s Career Reset
X

టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేనికి ఎలాంటి క్రేజ్ అందరికీ తెలిసిందే. వర్సటైల్ యాక్టర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఆయన.. క్యారెక్టర్లు, లుక్స్ పరంగా ఎప్పటికప్పుడు డిఫరెన్స్ చూపిస్తుంటారు. విభిన్నమైన కథలు ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ ఆడియన్స్ ను అలరిస్తుంటారు. వరుస సినిమాలతో సందడి చేస్తుంటారు.

మూవీ రిజల్ట్ తో ఎలాంటి సంబంధం లేకుండా సినిమాల్లో నటిస్తున్న రామ్.. చివరగా డబుల్ ఇస్మార్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఆ మూవీతో భారీ విజయం అందుకుంటారని అంతా అంచనా వేశారు. కానీ అనుకున్నట్లు జరగలేదు. బాక్సాఫీస్ వద్ద డబుల్ ఇస్మార్ట్ మూవీతో అందరినీ నిరాశపరిచారు.

అలా సరైన హిట్ కోసం కొంతకాలం వెయిట్ చేస్తున్న హీరో రామ్.. ఇప్పుడు తన మార్గాన్ని మార్చుకున్నారని క్లియర్ గా తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ఫేమ్ పి. మహేష్ తో ఆంధ్ర కింగ్ తాలూకా మూవీని చేస్తున్నారు. శరవేగంగా సినిమా షూటింగ్ జరుగుతుండగా.. త్వరలోనే చిత్రీకరణ పూర్తి అవ్వనున్నట్లు సమాచారం.

రీసెంట్ గా మేకర్స్ రిలీజ్ చేసిన గ్లింప్స్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. మూవీపై పాజిటివ్ బజ్ కూడా క్రియేట్ అయింది. త్వరలోనే సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అదంతా ఓకే అయినా.. రామ్ నెక్స్ట్ మూవీ ఏంటన్నది క్లారిటీ లేదు. తన తదుపరి సినిమాను ఇప్పటి వరకు రామ్ అనౌన్స్ చేయలేదు. సంతకం కూడా చేయలేదు.

ప్రస్తుతం కొందరు యువ దర్శకులు రామ్ తో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఏకంగా ఆరుగురు యంగ్ డైరెక్టర్స్.. రామ్ కోసం స్క్రిప్ట్ లపై వర్క్ చేస్తున్నారని సమాచారం. మరికొద్ది రోజుల్లో తాము రాసుకున్న కథపై రామ్ తో డిస్కస్ చేయనున్నారని వినికిడి. దీంతో ఇప్పుడు ఆ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

నెవ్వర్ బిఫోర్ అనేలా.. రామ్ కు ఇప్పుడు ఆఫర్స్ వస్తున్నట్లు క్లియర్ గా తెలుస్తోంది. డిమాండ్ ఫుల్ గా ఉందని అర్థమవుతోంది. అయితే రామ్.. ఎవరికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా ఆయనకు ఇప్పుడు సరైన హిట్ కావాల్సిందే. మరి ఆ ఆరుగురు యువ దర్శకుల్లో ఎవరు ఛాన్స్ అందుకుంటారో వేచి చూడాలి.