రామ్ మళ్లీ సైలెన్స్ ఏంటి..?
ఐతే అసలైతే ఈ సినిమాను జూలై 14న రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ అది కుదరలేదు. రామ్ ఆంధ్రా కింగ్ తాలూకా రిలీజ్ ఎప్పుడన్నది క్లారిటీ రాలేదు.
By: Tupaki Desk | 14 July 2025 8:00 AM ISTఉస్తాద్ రామ్ హీరోగా మహేష్ బాబు పి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా ఆంధ్రా కింగ్ తాలూకా. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో మిస్టర్ బచ్చన్ బ్యూటీ భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాకు వివేక్ మెర్విన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఐతే ఈ సినిమా నుంచి రీసెంట్ గా ఒక టీజర్ రాగా అది రామ్ ఫ్యాన్స్ ని మెప్పించింది.
ఐతే అసలైతే ఈ సినిమాను జూలై 14న రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ అది కుదరలేదు. రామ్ ఆంధ్రా కింగ్ తాలూకా రిలీజ్ ఎప్పుడన్నది క్లారిటీ రాలేదు. ఓ పక్క ఆగష్టు 14, ఆ తర్వాత సెప్టెంబర్ థర్డ్ వీక్ రిలీజ్ సినిమాలు ఫిక్స్ అయ్యాయి. ఇంతకీ రామ్ సినిమా ఎప్పుడొస్తుంది. సినిమా అప్డేట్స్ ఎందుకు ఇవ్వట్లేదని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
అసలే రామ్ ఈమధ్య వరుస ఫ్లాపులతో కెరీర్ రిస్క్ లో పడ్డాడు. ఇలాంటి టైం లో ఆంధ్రా కింగ్ తాలూకా అంటూ ఒక క్రెజీ టైటిల్ తో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో భాగ్య శ్రీతో తన రొమాన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని తెలుస్తుంది. రామ్ భాగ్య శ్రీ లవ్ స్టోరీ సినిమాకే హైలెట్ అంటున్నారు. భాగ్య శ్రీకి కూడా ఈ సినిమా కెరీర్ బూస్ట్ ఇచ్చే ప్రాజెక్ట్ అవుతుందని అంటున్నారు.
రామ్ ఆంధ్రా కింగ్ తాలూకా ఆగష్టులో రిలీజ్ అనుకుంటే మాత్రం ఈపాటికి ప్రమోషన్స్ మొదలు పెట్టేయాలి. అలా కాకుండా సెప్టెంబర్ ఫస్ట్ వీక్ ఐతే మాత్రం కాస్త ఆలోచించుకోవాలి. ఏది ఏమైనా ఈమధ్య స్టార్ సినిమాలు కూడా భారీ ప్రమోషన్స్ చేస్తేనే తప్ప వర్క్ అవుట్ అవ్వలేని పరిస్థితి ఉంది. సో తప్పకుండా రామ్ ఆంధ్రా కింగ్ తాలూకా సినిమా ఆడియన్స్ ని ఎంగేజ్ చేయాలంటే సరైన ప్రమోషన్స్ చేయాలి.
రామ్ కెరీర్ లో ఫ్లాపుల వల్ల ఫ్యాన్స్ కాస్త అసంతృప్తిగా ఉన్నారు. అందుకే ఈ సినిమాను తప్పకుండా వారి అంచనాలకు తగినట్టుగానే ఉండాలని కష్టపడుతున్నాడట రామ్. యూత్ ఫుల్ సినిమాలతో రామ్ ఎనర్జిటిక్ హిట్లు కొడుతుంటాడు. ఐతే ఆంధ్రా కింగ్ తాలూకా కూడా రామ్ లోని ఎనర్జీని చూపించేలా ఉంటుందని అంటున్నారు. తప్పకుండా ఈ సినిమా రామ్ ఫ్యాన్స్ ని ఖుషి చేస్తుందని చెబుతున్నారు.
