పిఠాపురం తాలుకాలో ఆంధ్రా కింగ్ ?
ఎనర్జిటిక్ స్టార్ రామ్ కథానాయకుడిగా మహేష్ బాబు. పి దర్శకత్వంలో 'ఆంధ్రా కింగ్ తాలుకా' అనే చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 20 Jun 2025 10:46 AM ISTఎనర్జిటిక్ స్టార్ రామ్ కథానాయకుడిగా మహేష్ బాబు. పి దర్శకత్వంలో 'ఆంధ్రా కింగ్ తాలుకా' అనే చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కొంత భాగం షూటింగ్ పూర్తిచేసుకుంది. ప్రస్తుతం చిత్రీకరణ అల్యుమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. ఇందులో రామ్, ఉపేంద్ర సహా ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. టైటిల్ ని బట్టే పక్కా మాస్ కమర్శియల్ చిత్రంగా తెలుస్తుంది.
మహేష్ ఇంత వరకూ ఈ తరహా సినిమాలు చేయలేదు. డిఫరెంట్ జానర్లో సినిమాలు చేసి తనకంటూ ఓ ప్రత్యేకత చాటాడు. కానీ ఆ పాత దారిలో వెళ్తే కమర్శియల్ గా వర్కౌట్ అవ్వకపోవడంతో కమర్శియల్ పంథాలోకి వచ్చి చేస్తోన్న చిత్రమిది. ఇందులో రామ్ కి జోడీగా భాగ్య శ్రీ బోర్సే నటిస్తుంది. ఇద్దరి మధ్య రొమాంటిక్ సన్నివేశాలు కూడా పీక్స్ లో ఉంటాయని సమాచారం.
'ఆంధ్రా కింగ్ తాలూకా' అన్న టైటిల్ పిఠాపురం 'ఎమ్మెల్యే గారి తాలూకా' నుంచే వచ్చింది. పవన్ కళ్యాణ్ తొలిసారి ఏపీ అసెంబ్లీకి పిఠాపురం నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీతో గెలవడంతో ఎమ్మేల్యే గారి తాలుకా? అన్న అంశం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆయన అభిమానులు బైక్ లపై అదే పేరును వేసుకుని రౌండ్లు వేయడం..అవి నెట్టింట వైరల్ గానూ మారాయి.
దీంతో ఆ క్రేజ్ ను ఎన్ క్యాష్ చేసుకుంటూ రామ్ అండ్ కో 'ఆంధ్రా కింగ్ తాలూకా' అంటూ టైటిల్ నిర్ణయించారు. టైటిల్ క్యాచీగా ఉండటంతో జనాల్లోకి వేగంగా వెళ్లింది. రామ్ ఎనర్జీకి తగ్గ టైటిల్ గానూ కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో సినిమాలో కొన్ని కీలక సన్నివేశాలను పిఠాపురం నియోజకవర్గంలో చిత్రీకరించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. అక్కడ లోకేషన్లలో షూటింగ్ చేస్తే సినిమాకు మరింత బజ్ రావడం ఖాయం.
