రాత్రిళ్లు కష్టపడుతున్న ఆంధ్రా కింగ్
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ హైదరాబాద్, రాజమండ్రిలోని కొన్ని ఏరియాల్లో జరిగింది.
By: Tupaki Desk | 11 July 2025 12:31 PM ISTఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేనికి గత కొంతకాలంగా ఏం చేసినా కలిసి రావడం లేదు. ఎన్నో అంచనాలు పెట్టుకుని సినిమాలు చేయడం ఆ సినిమాలన్నీ తన ఆశలను నిరాశగా మార్చడం. కొన్ని సినిమాలుగా రామ్ కు ఇదే పరిస్థితి ఎదురవుతూ వస్తోంది. రామ్ ఆఖరిగా హిట్ అందుకుంది ఇస్మార్ట్ శంకర్ సినిమాతో. ఆ సినిమా తర్వాత పలు సినిమాలు చేసినప్పటికీ అవన్నీ ఫ్లాపులుగానే మిగిలాయి.
ఈ పరిస్థితుల నుంచి బయట పడాలంటే ఎట్టి పరిస్థితుల్లో అర్జెంటుగా ఓ హిట్ కొట్టాలని ఎంతో కసితో ఉన్నారు రామ్. అందులో భాగంగానే తన తర్వాతి సినిమాను మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ఫేమ్ మహేష్ బాబు దర్శకత్వంలో చేస్తున్నారు. ఈ సినిమాకు ఆంధ్రా కింగ్ తాలూకా అనే టైటిల్ ను ఫిక్స్ చేసి సినిమాపై మంచి బజ్ ను పెంచిన చిత్ర యూనిట్ మొన్నా మధ్య సినిమా నుంచి గ్లింప్స్ ను రిలీజ్ చేసింది.
ఆ గ్లింప్స్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. గ్లింప్స్ చూస్తుంటే ఈ సినిమాలో రామ్ ఓ స్టార్ హీరోకు డై హార్డ్ ఫ్యాన్ గా కనిపించనున్నట్టు అర్థమైపోయింది. గ్లింప్స్ లో రామ్ బాడీ లాంగ్వేజ్, యాక్టింగ్ అందరినీ మెప్పించాయి. ఉపేంద్ర ఈ సినిమాలో స్టార్ హీరో సూర్య కుమార్ పాత్రలో నటించనుండగా, భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ హైదరాబాద్, రాజమండ్రిలోని కొన్ని ఏరియాల్లో జరిగింది. ఇప్పుడు ఈ మూవీ కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ స్పెషల్ సెట్ వేసి అందులో 10 రోజుల పాటూ హీరో హీరోయిన్‌పై నైట్ షెడ్యూల్ లో రొమాంటిక్ సీన్స్ ను షూట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆ తర్వాత 20 రోజుల్లో క్లైమాక్స్ ను షూట్ చేయనున్నారట.
దీంతో ఆంధ్రా కింగ్ తాలూకాకు సంబంధించిన షూటింగ్ చాలా వరకు పూర్తవుతుందని తెలుస్తోంది. షూటింగ్ పూర్తయ్యాక మేకర్స్ ఈ సినిమాకు ఫుల్ లెంగ్త్ ప్రమోషన్స్ ను ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారట. వివేక్- మార్విన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను చాలా కొత్త కాన్సెప్ట్ తో మునుపెన్నడూ చూడని ఎక్స్‌పీరియెన్స్ తో డైరెక్టర్ ఆడియన్స్ కు ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే.
