'ఆంధ్ర కింగ్ తాలుక' ఫస్ట్ ఛాయిస్ ఆ హీరో కాదా?
ఇటీవల యాక్షన్ ఎంటర్ టైనర్‌లు చేసిన రామ్ ఈ సారి దర్శకుడు మహేష్‌బాబు డైరెక్షన్‌లో కొత్త సినిమాకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే
By: Tupaki Desk | 17 May 2025 9:00 PM ISTఉస్తాద్, ఎనర్జిటిక్ హీరో రామ్ కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇటీవల యాక్షన్ ఎంటర్ టైనర్‌లు చేసిన రామ్ ఈ సారి దర్శకుడు మహేష్‌బాబు డైరెక్షన్‌లో కొత్త సినిమాకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై భారీ స్థాయిలో రూపొందుతున్నీ మూవీకి హీరో రామ్ పుట్టిన రోజు సందర్భంగా టైటిల్‌ని మేకర్స్ ప్రకటించింది. ఈ సినిమాకు అంతా ఊమించినట్టుగానే `ఆంధ్ర కింగ్ తాలూక` అనే టైటిల్‌ని ఫైనల్ చేశారు.
ఈ విషయాన్ని తెలియజేస్తూ గురువారం టైటిల్ గ్లింప్స్‌ని విడుదల చేసింది. `బయోపిక్ ఆఫ్ ఏ ఫ్యాన్` అనే ట్యాగ్ లైన్‌తో రూఈ మూవీలో రామ్ సూర్య కింగ్ అనే హీరో వీరాభిమాని సాగర్‌గా కనిపించనున్నారు. సూర్య ఇకంగ్ అనే హీరోగా కీలక పాత్రలో కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర నటిస్తున్నారు. తన కోసం ఏం చేయడానికైనా వెనుకాడని అభిమానిగా విభిన్నమైన క్యారెక్టర్‌లో రామ్ నటిస్తున్న ఈ మూవీ ఇది. ఇందులో రామ్‌కు జోడీగా `మిస్టర్ బచ్చన్` ఫేమ్ భాగ్యశ్రీ బోర్సే నటిస్తోంది.
ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ మూవీలో రామ్ క్యారెక్టర్, తన మేకోవర్ చాలా భిన్నంగా సరికొత్తగా ఉండనుందని ఫస్ట్‌లుక్, టైటిల్ గ్లింప్స్‌లతో ఓ క్లారిటీ వచ్చేసింది. ఇదిలా ఉంటే ఈ మూవీలోని కీలకమైన హీరో క్యారెక్టర్ ఫస్ట్ ఛాయిస్ ఉపేంద్ర కాదట. ఈ క్యారెక్టర్ కోసం ముందు చిత్రబృందం నందమూరి బాలయ్యను సంప్రదించారట. స్టోరీ విన్న బాలకృష్ణ కన్విన్స్ కాలేదట. దీంతో ఈ ప్రాజెక్ట్‌ని బాలయ్య రిజెక్ట్ చేశాడని, ఆ తరువాతే టీమ్ ఆ క్యారెక్టర్ కోసం కన్నడ స్టార్ ఉపేంద్రని సంప్రదించారని తెలిసింది.
స్టోరీ, తన క్యారెక్టర్‌తో పాటు రెమ్యునరేషన్ కూడా నచ్చడంతో ఉపేంద్ర ఈ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ఇన్ సైడ్ టాక్. రామ్ హై ఎనర్జీతో చేస్తున్న ఈ మూవీని ఇదే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మైత్రీ మూవీ మేకర్స్ వారు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ మూవీ తదుపరి షూటింగ్‌ని వీలైనంత ఫాస్ట్‌గా పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని టీమ్ ప్లాన్ చేస్తోంది.
