ఆంధ్రా కింగ్ వచ్చేదప్పుడేనా?
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా గ్లింప్స్ ను రాపో పుట్టిన రోజు సందర్భంగా మే 15న రిలీజ్ చేయనున్నారు.
By: Tupaki Desk | 12 May 2025 11:00 AM ISTఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ఫేమ్ పి. మహేష్ బాబు దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రామ్ కెరీర్లో 22వ చిత్రంగా ఈ సినిమా తెరకెక్కుతుంది. రాపో22 వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలో నవీన్ యేర్నేని, రవి శంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు.
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా గ్లింప్స్ ను రాపో పుట్టిన రోజు సందర్భంగా మే 15న రిలీజ్ చేయనున్నారు. గ్లింప్స్ తో పాటూ అదే రోజున టైటిల్ ను కూడా రివీల్ చేయనున్నట్టు సమాచారం. ఈ సినిమాకు ఆంధ్రా కింగ్ తాలూకా అనే టైటిల్ ను మేకర్స్ పరిశీలిస్తున్నట్టు గత కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.
ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా గురించి మరో అప్డేట్ ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. అదే రాపో22 రిలీజ్ డేట్. వీలైనంత త్వరగా షూటింగ్ ను పూర్తి చేసి ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ ను కూడా ఫినిష్ చేసి సినిమాను సెప్టెంబర్ లో రిలీజ్ చేయాలని మేకర్స్ ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది.
మే 15న గ్లింప్స్, టైటిల్ తో పాటూ రిలీజ్ డేట్ అప్డేట్ కూడా వచ్చే అవకాశాలున్నాయి. ఇక సినిమా విషయానికొస్తే ఈ సినిమాలో రామ్ ఒక స్టార్ హీరోకి ఫ్యాన్ గా కనిపించనున్నాడు. ఆ హీరో పాత్ర కోసం ముందుగా బాలకృష్ణను అనుకున్నారు. ఆ తర్వాత కన్నడ హీరో శివరాజ్ కుమార్ ను అనుకున్నారు. మోహన్ లాల్ పేరు కూడా వినిపించింది.
ఆఖరికి ఆ పాత్రను ఉపేంద్ర చేస్తున్నారు. సినిమాలో ఆంధ్రా కింగ్ పాత్రలో ఉపేంద్ర కనిపించనున్నారు. ఆయనకు అభిమాని అయిన హీరో ఆంధ్రా కింగ్ తాలూకా అని చెప్పుకుంటూ ఉంటాడు. టైటిల్ క్యాచీగా ఉండటంతో పాటూ ఈ మధ్య పవన్ డిప్యూటీ సీఎం అయ్యాక అందరూ పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అని చెప్తూ ఆ మాటను మారు మోగేలా చేయడంతో రామ్ సినిమా టైటిల్ ఆడియన్స్ కు త్వరగా రీచ్ అయ్యే ఛాన్సుంది. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు వివేక్- మెర్విన్ ద్వయం మ్యూజిక్ ఇస్తున్నారు.
