రామ్ నెక్స్ట్ పాన్ ఇండియా బెట్..?
ప్రస్తుతం 60 నుంచి 70 శాతం వరకు పూర్తైన ఈ సినిమాను త్వరగా పూర్తి చేసి రిలీజ్ చేయాలని చూస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో వస్తున్న వన్ ఆఫ్ ది క్రేజీ ప్రాజెక్ట్ గా ఇది ఉంది.
By: Tupaki Desk | 17 April 2025 2:30 AMఉస్తాద్ రామ్ ప్రస్తుతం మహేష్ బాబు పి డైరెక్షన్ లో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో రామ్ సరసన అందాల భామ భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్ గా నటిస్తుంది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు బాగున్నాయి. రామ్ ఈ సినిమాతో తప్పకుండా సూపర్ హిట్ కొడతాడని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. రామ్ లుక్ ఇంకా సినిమాలో హీరో హీరోయిన్ కెమిస్ట్రీ సినిమాకు హైలెట్స్ గా ఉంటాయని తెలుస్తుంది.
ప్రస్తుతం 60 నుంచి 70 శాతం వరకు పూర్తైన ఈ సినిమాను త్వరగా పూర్తి చేసి రిలీజ్ చేయాలని చూస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో వస్తున్న వన్ ఆఫ్ ది క్రేజీ ప్రాజెక్ట్ గా ఇది ఉంది. ఐతే ఈ సినిమా తర్వాత రామ్ నెక్స్ట్ సినిమా స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ తో ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. రామ్ హరీష్ శంకర్ కాంబో దాదాపు ఫిక్స్ అని అంటున్నారు.
ఈ సినిమాను కేవలం తెలుగు వరకే కాకుండా పాన్ ఇండియా రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారట. రామ్ కి హిందీలో మంచి మార్కెట్ ఉంది. ఆయన డబ్బింగ్ సినిమాలు హిందీ యూట్యూబ్ లో రికార్డ్ వ్యూస్ రాబడుతున్నాయి. స్కంద సినిమా తెలుగులో ఫ్లాప్ అయినా హిందీ యూట్యూబ్ లో మాత్రం మిలియన్ల కొద్దీ వ్యూస్ రాబట్టింది. అందుకే రామ్ ఈసారి పర్ఫెక్ట్ ప్లానింగ్ తో పాన్ ఇండియా బొమ్మ చేయాలని చూస్తున్నాడు.
ఐతే హరీష్ శంకర్ చెప్పిన లైన్ కాస్త కష్టపడి డెవలప్ చేస్తే తప్పకుండా పాన్ ఇండియా రీచ్ ఉంటుందట. అందుకే ఆ కథ మీద కూర్చున్నారని తెలుస్తుంది. ఈమధ్య తెలుగు స్టార్ డైరెక్టర్స్ అంతా కూడా పాన్ ఇండియా సినిమాలతో సందడి చేస్తున్నారు. నేషనల్ లెవెల్ లో బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటుతున్నారు. ఐతే హరీష్ శంకర్ కూడా ఈసారి పాన్ ఇండియా మూవీ చేయాలని అనుకుంటున్నారట. రామ్ కు ఎలాగు అక్కడ మార్కెట్ ఉంది కాబట్టి సరైన కథతో పాన్ ఇండియా బెట్ చేయబోతున్నారని తెలుస్తుంది. మరి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన మరిన్ని డీటైల్స్ త్వరలో తెలుస్తుంది.
రామ్ 22 సినిమా ఇలా రిలీజ్ అవడమే ఆలస్యం హరీష్ శంకర్ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్తుందని టాక్. ఐతే రామ్ తో పాటు బాలకృష్ణ సినిమా కూడా హరీష్ శంకర్ డిస్కషన్స్ లో ఉంది. మరి ఈ సినిమాల్లో ఏది ముందు అన్నది కన్ ఫ్యూజన్ క్లియర్ కావాల్సి ఉంది.