Begin typing your search above and press return to search.

ప‌ని లేక ఇంట్లో కూచున్నా న‌ష్టం లేదు.. న‌టుడి వ్యాఖ్య‌లు

జియో హాట్‌స్టార్ వెబ్ సిరీస్ 'మిస్త్రీ' ప్రమోషనల్ కార్యకలాపాల నుండి నటుడు రామ్ కపూర్‌ను తొలగించిన తర్వాత అత‌డు మీడియా హెడ్ లైన్స్ లో కొచ్చిన సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   25 Jun 2025 9:57 AM IST
ప‌ని లేక ఇంట్లో కూచున్నా న‌ష్టం లేదు.. న‌టుడి వ్యాఖ్య‌లు
X

జియో హాట్‌స్టార్ వెబ్ సిరీస్ 'మిస్త్రీ' ప్రమోషనల్ కార్యకలాపాల నుండి నటుడు రామ్ కపూర్‌ను తొలగించిన తర్వాత అత‌డు మీడియా హెడ్ లైన్స్ లో కొచ్చిన సంగ‌తి తెలిసిందే. ఆయన ఓ మీడియా స‌మావేశంలో లైంగికంగా అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిర్మాతలు ఈ కఠినమైన చర్య తీసుకున్నారు. వివాదానంత‌రం అత‌డి నుంచి స్పంద‌న ఎలా ఉంటుందా? అని అంతా ఎదురు చూసారు.


రామ్ కపూర్ నాణ్యమైన పాత్రలు చేయడానికి మాత్ర‌మే ఇష్ట‌ప‌డ‌తాడు.. కాబట్టి జాబ్ గురించి అంత‌గా చింతించడు. మునుపటి ఇంటర్వ్యూలో ఓసారి తాను ఇంట్లో కూర్చోవడం సంతోషంగా ఉందని చెప్పాడు. నిర్మాతలు తనకు కఠినమైన పాత్రలను అందిస్తారని అత‌డు అన్నారు. ప్రజలు ఇప్పుడు నాకు తగినంత గౌరవం ఇస్తున్నారు. నిర్మాత‌లు నాకు రుచికరమైనదాన్ని మాత్రమే ఆఫ‌ర్ చేస్తారు. ప్రతి ఒక్కరికి నా గురించి తెలుసు..రామ్ ఆరు నెలలు ఇంట్లో కూర్చుని సంతోషంగా ఉంటాడు కానీ అర్థ‌వంతం కానివి చేయ‌డు. ఎల్లప్పుడూ అర్థవంతమైనది మాత్ర‌మే చేస్తాడు. డ‌బ్బు సంపాదించ‌డానికి ప‌ని చేయ‌డం కంటే మరేదైనా చేయడానికి ఇష్టపడతాడు.. అని అన్నారు.

రామ్ సినిమా టీవీ రంగాల‌తో పాటు ఓటీటీల కోసం పనిచేశాడు. అతడు అమెరికాలో నాలుగు సంవత్సరాలు మెథడ్ యాక్టింగ్‌లో శిక్షణ పొందాడు. అవకాశాలు పొందడం తనకు అదృష్టమని, ప్రతి ప్రాజెక్ట్‌తో నటుడిగా అభివృద్ధి చెందుతూనే ఉన్నానని అతడు భావిస్తున్నాడు. రిటైర్ మెంట్ గురించి అత‌డు మాట్లాడాడు. సరైన ప్రాజెక్టులను ఎంచుకోవడం, గౌరవప్రదంగా, ప్రొఫెషనల్‌గా ఉండటం కొనసాగిస్తే, నేను పదవీ విరమణ చేయడానికి ముందు మరో 10 నుండి 15 సంవత్సరాలు పనిచేసే అదృష్టం నాకు లభిస్తుంది. సరే.., రామ్ కపూర్ ఉద్దేశ్యం చాలా స్పష్టంగా ఉంది. చెడు ప్రాజెక్టుల కంటే మంచి ప్రాజెక్టులు చేయడాన్ని రామ్ క‌పూర్ నమ్ముతాడు.

వివాదంతో బ్యాడ్ నేమ్:

రామ్ న‌టించిన వెబ్ సిరీస్ మిస్త్రీ లో మోనా సింగ్, శిఖా తల్సానియా, క్షితిష్ డేట్ కూడా కీలక పాత్రల్లో నటించారు. ఈనెల 27 నుంచి జియో హాట్ స్టార్‌లో విడుదలకు సిద్ధంగా ఉంది. రామ్ క‌పూర్ ని ప్ర‌మోష‌న్స్ నుంచి నిషేధించాక మోనా ప్ర‌మోష‌న్స్ బాధ్య‌త‌ల్ని చేప‌ట్టారు.

అస‌లు రామ్ క‌పూర్ చేసిన అనుచిత వ్యాఖ్య‌లు ఏవి అని ప్ర‌శ్నిస్తే... అత‌డు మీడియా ఇంట‌ర్వ్యూల స‌మ‌యంలో ఇంటర్వ్యూల పనిభారాన్ని గ్యాంగ్ రేప్ తో పోల్చాడు. ఈ వ్యాఖ్య అక్కడ మీడియా వ్య‌క్తుల‌లో తీవ్ర‌ ఆందోళనకు దారి తీసింది. అలాగే మ‌హిళ‌ల దుస్తుల గురించి వ్యాఖ్యానిస్తూ, `తీవ్ర అంత‌రాయం క‌లిగిస్తా`య‌ని అన్నాడు. అతడు ఒకరి తల్లి గురించి జోక్ చేసాడు.. ఆమెకు ప్రసవాన్ని నివారించడానికి తలనొప్పి ఉన్నట్లు నటించాలని సూచించాడు. అలాగే లైంగికంగా పొజిష‌న్స్ గురించి చాలా చెడు వ్యాఖ్యలు చేశాడు. మీడియా హ‌ర్ట్ అవ్వ‌డంతో ఫిలింమేక‌ర్స్ చెప్ప‌డ‌మే గాక‌, అంత‌ర్గ‌తంగా త‌న బృందంతో చ‌ర్చించి రామ్ క‌పూర్ ని ప్ర‌మోష‌న్స్ కి దూరం చేసార‌ని తెలుస్తోంది.