కోర్డు డైరెక్టర్ నెక్ట్స్.. ఆ హీరోతోనా?
ఆ తర్వాత ఆ క్రేజ్ ను మరింత పెంచుకుని నేచురల్ స్టార్ నానిగా మారాడు. ఆ తర్వాత నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి నిర్మాతగా కూడా సినిమాలు చేస్తూ సక్సెస్ లు అందుకుంటున్నాడు నాని.
By: Tupaki Desk | 14 May 2025 10:23 AMఎటువంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన నాని మొదటిగా అసిస్టెంట్ డైరెక్టర్ గా తన కెరీర్ ను స్టార్ట్ చేసి ఆ తర్వాత హీరోగా మారి సినిమాలు చేసి పక్కింటి అబ్బాయిగా పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత ఆ క్రేజ్ ను మరింత పెంచుకుని నేచురల్ స్టార్ నానిగా మారాడు. ఆ తర్వాత నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి నిర్మాతగా కూడా సినిమాలు చేస్తూ సక్సెస్ లు అందుకుంటున్నాడు నాని.
ఓ వైపు హీరోగా వరుస సక్సెస్ లు అందుకుంటున్న నాని, మరోవైపు నిర్మాతగా కూడా మంచి కంటెంట్ ను ఆడియన్స్ కు అందిస్తూ సినిమాపై తన అభిరుచిని తెలియచేస్తున్నాడు. నాని హీరోగా చేసినా, నాని నుంచి నిర్మాతగా సినిమా వచ్చినా అందులో మినిమం కంటెంట్ ఉంటుందని ఆడియన్స్ అనుకునే స్టేజ్ కు నాని ఇప్పుడు చేరుకున్నాడు.
రీసెంట్ గా కోర్టు సినిమాతో రామ్ జగదీష్ అనే కొత్త టాలెంట్ ను డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయం చేసిన నాని, ఆ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. కోర్టు సినిమాకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. పైగా ఫోక్సో చట్టం లాంటి సున్నితమైన అంశాన్ని రామ్ జగదీష్ తెరకెక్కించిన విధానం కూడా అందరినీ ఆకట్టుకుంది.
దీంతో రామ్ జగదీష్ నెక్ట్స్ మూవీ ఎవరితో చేస్తాడా అని అందరిలోనూ ఆసక్తి పెరిగింది. ఈ నేపథ్యంలో దానిపై ఓ అప్డేట్ వినిపిస్తోంది. రామ్ జగదీష్ రెండో సినిమా కూడా నాని బ్యానర్ లోనే ఉంటుందని సమాచారం. కోర్టు సినిమాతో నిర్మాతగా తనకు మంచి విజయాన్ని ఇవ్వడంతో నాని రామ్ జగదీష్ కు మరో ఛాన్స్ ఇచ్చాడని తెలుస్తోంది.
వాల్ పోస్టర్ బ్యానర్ లోనే రామ్ జగదీష్ తన రెండో సినిమాను చేయనున్నాడని సమాచారం. అయితే ఈ సారి రామ్ జగదీష్ కాస్త పెద్ద హీరో కోసం కథ రాస్తున్నాడని తెలుస్తోంది. కోర్టు తర్వాత రామ్ జగదీష్ ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ కోసం కథ రెడీ చేస్తున్నాడని, అన్నీ కుదిరితే ఈ కాంబినేషన్ లో మూవీ సెట్ అయ్యే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.