కోర్టు డైరెక్టర్ నెక్ట్స్ ఏంటి?
కోర్టు వర్సెస్ నో బడీ సినిమాతో టాలీవుడ్ కు డైరెక్టర్ గా పరిచయమైన రామ్ జగదీష్ ఆ సినిమాతో ఎంతో మంచి హిట్ అందుకున్నాడు.
By: Tupaki Desk | 25 April 2025 6:51 PM ISTఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన నాని హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడంతో పాటూ నిర్మాణ రంగంలోకి ఎంటరై నిర్మాతగా మారి కొత్త టాలెంట్ ను ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ వస్తున్నాడు. తనలానే ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేని వారికి తన బ్యానర్ ద్వారా అవకాశాలు కల్పిస్తూ ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్న నాని రీసెంట్ గా కోర్టు సినిమాతో రామ్ జగదీష్ ను డైరెక్టర్ గా ఇంట్రడ్యూస్ చేసిన విషయం తెలిసిందే.
కోర్టు వర్సెస్ నో బడీ సినిమాతో టాలీవుడ్ కు డైరెక్టర్ గా పరిచయమైన రామ్ జగదీష్ ఆ సినిమాతో ఎంతో మంచి హిట్ అందుకున్నాడు. మొదటి సినిమాతోనే అంత పెద్ద హిట్ అందుకుని రామ్ జగదీష్ తనలో మ్యాటర్ ఉందని ప్రూవ్ చేసుకున్నాడు. కోర్టు సినిమాలో ఫోక్సో చట్టంపై సినిమా తీసి అంత సున్నితమైన సబ్జెక్టుని అతను డీల్ చేసిన విధానం అందరినీ ఆశ్చర్యపరిచింది.
కోర్టు సినిమాతో తన సత్తా చాటిన రామ్ జగదీష్ కు టాలీవుడ్ నిర్మాతల నుంచి సినిమాలు చేయమని ఆఫర్లు క్యూ కడుతున్నాయట. పలువురు నిర్మాతలు రామ్ జగదీష్ కు అడ్వాన్సులు కూడా ఇవ్వడానికి రెడీ అవుతున్నారని తెలుస్తోంది. అయినప్పటికీ రామ్ జగదీష్ మాత్రం తన రెండో సినిమాను కూడా వాల్‌పోస్టర్ సినిమాస్ బ్యానర్ లోనే చేయబోతున్నాడని తెలుస్తోంది.
తనకు కోర్టు సినిమా ద్వారా డైరెక్టర్ అయ్యే ఛాన్స్ ఇచ్చిన నాని సొంత బ్యానర్ లోనే రామ్ జగదీష్ రెండో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడని సమాచారం. ఆ తర్వాత మూడో సినిమాను వెంకట్ బోయినపల్లి బ్యానర్ లో చేసే ఆలోచనలో ఉన్నాడని తెలుస్తోంది. ఇవి కాకుండా మరే బ్యానర్లో సినిమా చేయడానికి రామ్ జగదీష్ కమిట్ అవలేదని సమాచారం.
