రామ్ సినిమా ఈసారి పెద్ద ప్లానింగ్..!
ఐతే రామ్ ఆంధ్రా కింగ్ తాలూకా సినిమా తర్వాత నెక్స్ట్ సినిమా హరీష్ శంకర్ తో చేస్తాడని చెబుతున్నారు.
By: Tupaki Desk | 17 May 2025 8:00 AM ISTఉస్తాద్ రామ్ త్వరలో ఆంధ్రా కింగ్ తాలూకా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మహేష్ బాబు డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి రీసెంట్ గా రిలీజైన ఫస్ట్ లుక్ టీజర్ ఇంప్రెస్ చేసింది. అసలు ఈ సినిమాలో కన్నడ స్టార్ ఉపేంద్ర నటిస్తున్నాడు అన్నది ఇప్పటివరకు సీక్రెట్ గా ఉంచారు. ఉపేంద్ర సన్నాఫ్ సత్యమూర్తి తర్వాత చేస్తున్న తెలుగు సినిమా ఇదే. ఐతే రామ్ ఈ సినిమాలో క్రేజీ లుక్స్ తో కనిపిస్తున్నాడు. సినిమాలో భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్ గా నటిస్తుండగా వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా అదిరిపోయిందని టాక్.
ఐతే రామ్ ఆంధ్రా కింగ్ తాలూకా సినిమా తర్వాత నెక్స్ట్ సినిమా హరీష్ శంకర్ తో చేస్తాడని చెబుతున్నారు. రామ్, హరీష్ శంకర్ ఇద్దరు హైపర్ యాక్టివ్ పర్సన్స్.. అలాంటి ఈ ఇద్దరు కలిసి సినిమా చేస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ క్రేజ్ ఉంటుంది. అంతేకాదు ఈ సినిమా కోసం హరీష్ శంకర్ రీమేక్ కథ కాకుండా సొంత కథతో వస్తున్నారని తెలుస్తుంది. ఇది ఇంకా శుభసూచకమని అందరు అంటున్నారు. రామ్ సినిమా విషయంలో హరీష్ శంకర్ ప్లానింగ్ అంతా వేరే రేంజ్ లో ఉందని తెలుస్తుంది.
రామ్ హరీష్ శంకర్ కాంబో సినిమాను ప్రముఖ బ్యానర్ నిర్మించనుంది. ఈ సినిమాను కేవలం తెలుగు వరకే అన్నట్టు కాకుండా పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కించే ప్లానింగ్ లో ఉన్నారని తెలుస్తుంది. రామ్ తో పాన్ ఇండియా అటెంప్ట్ అనగానే అతని ఫ్యాన్స్ సూపర్ ఎగ్జైట్ అవుతున్నారు. పూరీ జగన్నాథ్ తో చేసిన డబుల్ ఇస్మార్ట్ నేషనల్ రిలీజ్ చేసినా అది వర్క్ అవుట్ కాలేదు. ఐతే ఈసారి హరీష్ శంకర్ తో చేసే సినిమా ఒక స్టైలిష్ ఎంటర్టైనర్ గా రాబోతుందని తెలుస్తుంది.
ఈ సినిమాతో తప్పకుండా ఇటు హరీష్ శంకర్ అటు రామ్ ఇద్దరు పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ తెచ్చుకుంటారని అంటున్నారు. బాహుబలితో పాన్ ఇండియా డోర్స్ ఓపెన్ చేశాడు రాజమౌళి ఇక ఆ తర్వాత ఆర్.ఆర్.ఆర్, పుష్ప, దేవర ఇలా అన్ని సినిమాలు పాన్ ఇండియా అటెంప్ట్ చేస్తున్నాయి. టైర్ 2 హీరోల కేటగిరిలో ఉన్న నాని కూడా తన సినిమాలు ఓవరాల్ ఇండియా రిలీజ్ చేస్తున్నాడు. విజయ్ దేవరకొండ కూడా అలానే ప్రయత్నిస్తున్నాడు. సో ఇప్పుడు రామ్ కూడా హరీష్ శంకర్ సినిమాతో మరోసారి పాన్ ఇండియా లెవెల్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. మరి ఈ కాంబో సినిమా ఎలా ఉంటుందో చూడాలి.
