వర్మ హార్రర్ కామెడీపై అదిరిపోయే అప్డేట్
అయితే ఎలాగైనా కెరీర్లో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలని ఫిక్స్ అయిన రామ్ గోపాల్ వర్మ అందులో భాగంగానే ఓ హార్రర్ కామెడీ సినిమాను లైన్ లో పెట్టినట్టు వెల్లడించిన విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 23 July 2025 6:20 PM ISTతెలుగు సినీ ఇండస్ట్రీలో రామ్ గోపాల్ వర్మకు విలక్షణ డైరెక్టర్ అనే పేరు కూడా ఉంది. ఎప్పుడూ ఏదొక సంచలన సృష్టిస్తూ వార్తల్లో నిలిచే రామ్ గోపాల్ వర్మ తీసే ప్రతీ సినిమా సెన్సేషన్ అని చెప్పొచ్చు. ఆయన్నుంచి గత కొంతకాలంగా ఎన్నో డిజాస్టర్ సినిమాలు వచ్చినప్పటికీ ఇండియన్ సినిమాలో ఆయనకంటూ సుదీర్ఘ కెరీర్ కలిగి ఉన్నారు.
ఒకప్పుడు ఆయన్ని, ఆయన సినిమాలను ఎంతగానో అభిమానించే వాళ్లు కూడా ఇప్పుడాయన్ని విమర్శిస్తున్నారు. ఆయనపై ఎన్నో ట్రోల్స్, విమర్శలు వచ్చాయి అయినప్పటికీ ఆయన సినిమాలకు దర్శకత్వం వహించడం మానలేదు. ఆయన తీసిన సినిమాలను వ్యతిరేకిస్తూ ఎన్నో నిరసనలు జరిగాయి, ఈ నేపథ్యంలోనే రామ్ గోపాల్ వర్మ పై ఎన్నో కేసులు కూడా నమోదయ్యాయి.
అయినప్పటికీ ఆయన సినిమాలు చేయడం మానలేదు. అయితే ఎలాగైనా కెరీర్లో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలని ఫిక్స్ అయిన రామ్ గోపాల్ వర్మ అందులో భాగంగానే ఓ హార్రర్ కామెడీ సినిమాను లైన్ లో పెట్టినట్టు వెల్లడించిన విషయం తెలిసిందే. పోలీస్ స్టేషన్ మే భూత్ అనే టైటిల్ తో తెరకెక్కిన ఈ సినిమాను ఆర్జీవీ పాన్ ఇండియా స్థాయిలో రూపొందించనున్నారు.
సత్య, కౌన్, షూల్ లాంటి మైల్ స్టోన్ సినిమాల కోసం గతంలో వర్క్ చేసిన బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌పాయ్ ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించనుండగా జెనీలియా, రాజ్ పాల్ యాదవ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కాగా ఈ సినిమా షూటింగ్ జులై 26న మొదలుపెట్టి, ఈ ఏడాది ఆఖరికి షూటింగ్ ను పూర్తి చేయనుండగా, వచ్చే ఏడాది ఈ సినిమా రిలీజ్ ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇప్పటివరకు ఎన్నో జానర్లలో సినిమాలు చేసిన ఆర్జీవీ మొదటి సారి హార్రర్ కామెడీ జానర్ లో సినిమా చేస్తుండగా ఈ సినిమాలో అదిరిపోయే విజువల్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయని సినిమా అనౌన్స్‌మెంట్ టైమ్ లోనే ఆర్జీవీ తెలిపారు. ప్రజలకు భయమేస్తే పోలీస్ స్టేషన్ కు వెళ్తారు, కానీ అదే పోలీసులకు దెయ్యం కారణంగా భయమేస్తే ఎక్కడికెళ్తారనే నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనున్నట్టు కూడా ఆర్జీవీ వెల్లడించారు. ఆర్జీవీ నుంచి మొదటిసారి ఈ జానర్ లో సినిమా వస్తుండటంతో ఆయన ఫ్యాన్స్ లో ఈ సినిమాపై ఆసక్తి పెరిగింది.
