Begin typing your search above and press return to search.

మనీషా కొయిరాలా ట్వీట్‌కు ఆర్జీవీ రిప్లై.. తనదైన స్టైల్‌లో లాజిక్ లాగిన వర్మ!

ప్రముఖ సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ సోషల్ మీడియాలో చేసే పోస్టులు ఎప్పుడూ హాట్ టాపిక్కే. ఎవరినైనా విమర్శించాలన్నా, పొగడాలన్నా ఆయన రూటే వేరు.

By:  Madhu Reddy   |   13 July 2026 7:36 PM IST
మనీషా కొయిరాలా ట్వీట్‌కు ఆర్జీవీ రిప్లై.. తనదైన స్టైల్‌లో లాజిక్ లాగిన వర్మ!
X

ప్రముఖ సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ సోషల్ మీడియాలో చేసే పోస్టులు ఎప్పుడూ హాట్ టాపిక్కే. ఎవరినైనా విమర్శించాలన్నా, పొగడాలన్నా ఆయన రూటే వేరు. తాజాగా బాలీవుడ్ సీనియర్ నటి మనీషా కొయిరాలా ఎక్స్ (ట్విట్టర్) వేదికగా జీవిత సత్యాలపై ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టగా, దానికి ఆర్జీవీ తనదైన స్టైల్‌లో రీట్వీట్ చేస్తూ ఒక ఇంట్రెస్టింగ్ లాజిక్‌ను జోడించారు. ప్రస్తుతం ఈ ఇద్దరి ట్వీట్లు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

పాత పరిచయం.. పాత బంధం:

రాంగోపాల్ వర్మకు, మనీషా కొయిరాలాకు మధ్య మంచి సినీ అనుబంధం ఉంది. గతంలో వర్మ తీసిన సూపర్ హిట్ సినిమా 'కంపెనీ' లో మనీషా అద్భుతంగా నటించింది. ఆ సమయంలోనే ఆమె దేశంలోనే అత్యుత్తమ నటీమణులలో ఒకరంటూ వర్మ తెగ పొగిడేశారు. ఇక ఆ తర్వాత వీరిద్దరూ కలిసి 'భూత్ రిటర్న్స్' అనే హర్రర్ సినిమాలో కూడా వర్క్ చేశారు. అప్పుడు కూడా ఆమె యాక్టింగ్‌ను వర్మ ప్రత్యేకంగా ప్రశంసించారు.

మనీషా కొయిరాలా ఏం చెప్పిందంటే?:

ఇక అసలు విషయానికి వస్తే.. మనీషా కొయిరాలా తన జీవిత అనుభవాల ఆధారంగా ఒక మంచి విషయాన్ని పంచుకుంది. సమాజంలో తెలివితేటలు, అధికారం కంటే నైతిక విలువలు, పనిపట్ల నిబద్ధతే ముఖ్యమైనవి.. మనం రోజూ తీసుకునే చిన్న చిన్న నిర్ణయాల ద్వారానే మన వ్యక్తిత్వం రూపుదిద్దుకుంటుంది. అయితే అలాంటి మంచి నిర్ణయాలను ఎవరూ గమనించరు, మెచ్చుకోరు" అంటూ ఆమె ట్వీట్ చేసింది.

ఆర్జీవీ మార్క్ అదిరిపోయే కౌంటర్:

మనీషా చేసిన ఈ ట్వీట్‌కు ఆర్జీవీ ఊరుకుంటారా? వెంటనే తన మార్క్ ఫిలాసఫీతో స్పందించారు. నిజమే మనీషా.. కానీ ఆ చిన్న మంచి విషయాలు ఎందుకు ఎవరికీ కనిపించవో తెలుసా? జనాలు వాటిని అసలు గమనించనే గమనించరు. ఎందుకంటే ఈ లోకంలోని జనం ఎప్పుడూ ఇతరుల తెలివితేటలను, వారి దగ్గర ఉన్న అధికారాన్ని చూడటంలోనే బిజీగా ఉంటారు" అంటూ రాసుకొచ్చారు.

నెటిజన్లను ఆకట్టుకుంటున్న ట్వీట్:

ఎప్పుడూ వివాదాలతో సాగే వర్మ ట్విట్టర్ ఖాతాలో, ఇలాంటి ఒక ఫిలాసఫికల్ చర్చ రావడం ఫ్యాన్స్‌కు కొత్తగా అనిపించింది. ఇక సమాజం ఎలా ఆలోచిస్తుందో వర్మ చాలా సింపుల్‌గా, ప్రాక్టికల్‌గా చెప్పారంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మనీషా కొయిరాలా చెప్పిన పాయింట్‌కు వర్మ ఇచ్చిన ఎక్స్‌టెన్షన్ పర్‌ఫెక్ట్‌గా సెట్ అయిందని అంటున్నారు.

రాంగోపాల్ వర్మ ఏ విషయం మాట్లాడినా అందులో ఒక వింత లాజిక్ ఉంటుంది. ఇక తాజాగా మనీషా కొయిరాలా ట్వీట్‌కు ఆయన ఇచ్చిన రిప్లై కూడా సమాజంలో ఉన్న ఒక చేదు నిజాన్ని ఎండగట్టినట్లుగా ఉంది. అందుకే ఈ ఇద్దరు సెలబ్రిటీల మధ్య జరిగిన ఈ సోషల్ మీడియా సంభాషణ ఇప్పుడు అందరినీ ఆలోచింపజేస్తూ, సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది.