దావూద్ డీ-గ్యాంగ్ యాక్టివ్ అవ్వడంతో RGVలో ఒకటే టెన్షన్?!
బాలీవుడ్ యాక్షన్ స్పై థ్రిల్లర్ `దురంధర్` చిత్రం సృష్టించిన సంచలనం అటుంచితే ఈ సినిమా వల్ల అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు చెందిన డీ-కంపెనీ ముంబైలో మళ్లీ యాక్టివ్ అయిందనే వార్తలు సినీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి
By: Sivaji Kontham | 2 Jun 2026 5:00 AM ISTబాలీవుడ్ యాక్షన్ స్పై థ్రిల్లర్ `దురంధర్` చిత్రం సృష్టించిన సంచలనం అటుంచితే ఈ సినిమా వల్ల అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు చెందిన డీ-కంపెనీ ముంబైలో మళ్లీ యాక్టివ్ అయిందనే వార్తలు సినీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. అయితే ఈ తాజా పరిణామాలతో టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV) తీవ్ర టెన్షన్‌లో పడినట్లు ఇండస్ట్రీలో సరికొత్త చర్చ నడుస్తోంది. ఎందుకంటే దురంధర్ విడుదలైనప్పటి నుంచి దర్శకుడు ఆదిత్యాధర్, అతడి టీమ్ కి అండగా నిలిచింది వర్మ ఒక్కడే. విశ్లేషణాత్మకంగా సినిమాలు చూసే ఆర్‌జీవీ.. ఇటీవల కాలంలో `దురంధర్` చిత్రాన్ని విపరీతంగా పొగడటమే కాకుండా.. తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు, ఇంటర్వ్యూల ద్వారా ఆ సినిమాను నెత్తిన వేసుకుని మరీ ప్రమోషన్స్ చేశారు. అయితే అతడు పొగిడేసే క్రమంలో డాన్ దావూద్ గురించి కూడా మాట్లాడాడు. అందుకే ఇప్పుడు డి గ్యాంగ్ యాక్టివ్ అయిందనగానే ముందుగా టెన్షన్ పట్టుకుంది ఆర్జీవీకే నంటూ గుసగుస వినిపిస్తోంది. ఒకవైపు సినిమా యూనిట్‌పై డీ-గ్యాంగ్ ప్రతీకారేచ్ఛతో రగిలిపోతుంటే, ఆ చిత్రానికి భారీగా సపోర్ట్ చేసిన వర్మకు కూడా ముప్పు పొంచి ఉందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కొందరు.
అన్నట్టు అండర్‌వరల్డ్ నేర సామ్రాజ్యాన్ని, ముఖ్యంగా డీ-గ్యాంగ్‌ను విపరీతంగా అభిమానించటంలో ఆర్‌జీవీ స్టైలే వేరు. గతంలో ఆయన ముంబై మాఫియాపై, దావూద్ ఇబ్రహీంతో లింకప్ అయిన నేర ప్రపంచంపై ఉన్న ఆసక్తిని పలుమార్లు బహిరంగంగానే వెల్లడించారు. తన సినీ జీవితానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపును, సక్సెస్‌ను ప్రసాదించిన ఈ డి-గ్యాంగ్ కథలపై సినిమాలు తీయడానికి ఆర్‌జీవీ ఎప్పుడూ మొదటి వరుసలో ఉంటారు. ఇప్పుడు `దురంధర్` సినిమా ఎఫెక్ట్‌తో ముంబై అండర్‌వరల్డ్‌లో కదలికలు రావడం, దావూద్ నెట్‌వర్క్ మళ్లీ యాక్టివ్ కావడం చూస్తుంటే.. ఆర్‌జీవీలో కూడా ఒక రకమైన ఎగ్జైట్‌మెంట్ మొదలైందా? ఆయన మళ్లీ అండర్‌వరల్డ్ సబ్జెక్టులపై దృష్టి పెడుతున్నారా అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి.
గతంలో రామ్ గోపాల్ వర్మ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను దావూద్ ఇబ్రహీం డీ-గ్యాంగ్ కథల ఆధారంగా, ముంబై మాఫియాలో జరిగిన ఒరిజినల్ రియల్ ఇన్సిడెంట్స్ స్ఫూర్తితోనే తన క్లాసిక్ చిత్రం `సత్య`ను తెరకెక్కించానని స్పష్టం చేశారు. కేవలం సత్య మాత్రమే కాకుండా.. కంపెనీ, డి వంటి ఎన్నో అండర్‌వరల్డ్ గ్యాంగ్‌స్టర్ డ్రామాలను ఆయన వెండితెరపై ఆవిష్కరించారు. మాఫియా డాన్‌ల మానసిక స్థితి.. వారి అంతర్గత యుద్ధాలు, ముంబై వీధుల్లో సాగే గ్యాంగ్ వార్లను ఇంత రియలిస్టిక్‌గా చూపించడం ఒక్క ఆర్‌జీవీకే సాధ్యమైంది. అప్పట్లో ముంబై అండర్‌వరల్డ్‌కు చెందిన కొందరు వ్యక్తులతో తనకు ఉన్న పరిచయాలు, సమాచారం ఆధారంగానే ఆయా స్క్రిప్ట్‌లు సిద్ధం చేసుకున్నట్లు వర్మ గతంలో వెల్లడించారు.
ప్రస్తుతం అటు ముంబైలో డీ-కంపెనీ అలజడి సృష్టిస్తుంటే.. ఇటు వర్మ తన పాడ్‌కాస్ట్‌లలో `దురంధర్ 2` చిత్రంలో దావూద్ ఇబ్రహీం పాత్రను చూపించిన విధానంపై కొన్ని ఆసక్తికరమైన విమర్శలు చేయడం గమనార్హం. దావూద్ ఇబ్రహీంను స్క్రీన్‌పై ప్రెజెంట్ చేసిన యాక్ట్ అంత పర్ఫెక్ట్‌గా లేదంటూ ఆయన తనదైన విశ్లేషణను ఇచ్చారు.
ఏది ఏమైనా.. ఒకవైపు భద్రతా పరమైన టెన్షన్లు మొదలయ్యాయి. ముంబై హైఅలెర్ట్ గా ఉంది. మరోవైపు గ్యాంగ్‌స్టర్ డ్రామాలను అమితంగా ఇష్టపడే ఆర్‌జీవీ తాజా అండర్‌వరల్డ్ పరిణామాలను నిశితంగా గమనిస్తూ భయపడుతున్నాడనే ప్రచారం ఉంది. అలా కాకుండా అతడు కూడా రీయాక్టివేట్ అయ్యి మళ్లీ పాత ముంబై మాఫియా రోజులను గుర్తుచేసేలా ఒక భారీ గ్యాంగ్‌స్టర్ స్క్రిప్ట్‌ను తెరకెక్కించే ఆలోచన చేయాలని కూడా అభిమానులు కోరుకుంటున్నారు.
