Begin typing your search above and press return to search.

వ‌ర్మ‌-క‌మ‌ల్ హాస‌న్ కాంబినేష‌న్ సాధ్య‌మేనా?

మ‌రి ఇందులో నిజ‌మెంతో తెలియ‌దుగానీ క‌మ‌ల్ హాస‌న్ వ‌ర్మ‌కు అవ‌కాశం ఇస్తే సంచ‌ల‌న‌మే అవుతుంది.

By:  Tupaki Desk   |   17 May 2025 7:00 AM IST
వ‌ర్మ‌-క‌మ‌ల్ హాస‌న్ కాంబినేష‌న్ సాధ్య‌మేనా?
X

సంచ‌ల‌నాల రాంగోపాల్ వ‌ర్మ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. అప్ప‌ట్లో ఎలాంటి హిట్లు ఇచ్చారో ? ఆ త‌ర్వాత కాలంలో ఘోరమైన ప్లాప్ లు కూడా అందించిన చ‌రిత్ర ఆయ‌న‌ది. హిట్ ఇస్తే గొప్ప విమ‌ర్శ‌...ప్లాప్ ఇస్తే అంత‌క‌న్నా దారుణ‌మై ప్ర‌తివిమ‌ర్శ అందుకునే ఏకైక ద‌ర్శ‌కుడిగా ఆయ‌న‌కే పేరుంది. 26/ 11ముంబై ఎటాక్స్ త‌ర్వాత చాలా సినిమాలు చేసాడు. కానీ వాటిలో ఏదీ కూడా హిట్ అవ్వ‌లేదు. సౌండ్ లేకుండా వ‌చ్చాయి.

సౌండ్ లేకుండానే థియేట‌ర్ల నుంచి నిష్క్ర‌మించాయి. ఈ క్ర‌మంలో వ‌ర్మ త‌న శిష్యులకు అవ‌కాశం ఇచ్చి తాను నిర్మాత‌గా ఉండి సినిమాలు కూడా చేసారు. వాళ్లు కూడా స‌క్స‌స్ అవ్వ‌లేదు. త‌లో సినిమా చేసి వెళ్లి పోయారు. 'వ్యూహం' త‌ర్వాత వ‌ర్మ నుంచి సినిమా ప్ర‌క‌ట‌న కూడా రాలేదు. అయితే తాజాగా వ‌ర్మ విశ్వ‌న టుడు క‌మ‌ల్ హాస‌న్ కి స్టోరీ చెప్పిన‌ట్లు వార్త‌లొస్తున్నాయి. చెన్నైలో ఈ స్టోరీ భేటీ జరిగింద‌ని ప్ర‌చారం మొద‌లైంది.

మ‌రి ఇందులో నిజ‌మెంతో తెలియ‌దుగానీ క‌మ‌ల్ హాస‌న్ వ‌ర్మ‌కు అవ‌కాశం ఇస్తే సంచ‌ల‌న‌మే అవుతుంది. ఈ కాంబినేష‌న్ లో సినిమా అంటే ఊహ‌కే రాదు. ఇప్ప‌టి వ‌ర‌కూ వీళ్లిద్ద‌రు ఏ సినిమాకు క‌లిసి ప‌ని చేయ లేదు. పైగా క‌మ‌ల్ హాసన్ ఎంతో అప్ డేట్ గా ఉంటారు. ప్ర‌తిభావంతులైన కొత్త వారితో సినిమా చేయ‌డానికి ఆస‌క్తి చూపిస్తుంటారు. 'నాయ‌కుడు' త‌ర్వాత మ‌ణిర‌త్నంతో మ‌ళ్లీ సినిమా చేయ‌డానికి కొన్ని ద‌శాబ్దాలు ప‌ట్టింది.

'నాయకుడు' త‌ర్వాత క‌మ‌ల్ త‌న‌కు న‌చ్చిన ద‌ర్శ‌కులెంద‌ర్ని మ‌ళ్లీ రిపీట్ చేసారు. కానీ మ‌ణిర‌త్నంతో మాత్రం 'థ‌గ్ లైఫ్' చేయ‌డానికి మూడు ద‌శాబ్దాలు ప‌ట్టింది. అలాంటి క‌మ‌ల్ ప్లాప్ ల్లో ఉన్న వ‌ర్మ‌తో సినిమా చేసేంత సాహ‌సం చేయ‌ర‌ని ఆయ‌న అభిమానులు ఈ ప్ర‌చారాన్ని ఖండిస్తున్నారు.