ఎనర్జిటిక్ స్టార్ నిర్ణయానికి మరో రెండు నెలలా?
ఎనర్జిటిక్ స్టార్ రామ్ కు `ఇస్మార్ట్ శంకర్` తర్వాత వరుసగా నాలుగు ప్లాప్ లు పడిన సంగతి తెలిసిందే. `రెడ్`, `ది వారియర్`, ` స్కంద`, `డబుల్ ఇస్మార్ట్` రూపంలో బ్యాక్ టూ బ్యాక్ ఫెయిల్యూర్స్ చూసాడు.
By: Tupaki Desk | 1 March 2026 7:00 AM ISTఎనర్జిటిక్ స్టార్ రామ్ కు `ఇస్మార్ట్ శంకర్` తర్వాత వరుసగా నాలుగు ప్లాప్ లు పడిన సంగతి తెలిసిందే. `రెడ్`, `ది వారియర్`, ` స్కంద`, `డబుల్ ఇస్మార్ట్` రూపంలో బ్యాక్ టూ బ్యాక్ ఫెయిల్యూర్స్ చూసాడు. ఈ మధ్యనే రిలీజ్ అయిన `ఆంధ్రా కింగ్ తాలూకా` సినిమాకు హిట్ టాక్ వచ్చినా? జనాలు చూడని చిత్రంగా మిగిలి పోయింది. కమ ర్శియల్ గా ఆ సినిమా ఎంత మాత్రం వర్కౌట్ అవ్వలేదు. కేవలం ప్రశంసలు...పాజిటివ్ రివ్యూలకే పరిమితమైంది. దీంతో రామ్ ఇప్పుడు సరైన కమర్శియల్ హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఇంత వరకూ ఏ డైరెక్టర్ కి అధికారికంగా డేట్లు ఇవ్వలేదు.
మరి తదుపరి రామ్ ఎలాంటి స్టోరీలో కనిపించనున్నాడు? అంటే ఓ లవ్ స్టోరీ, ఓ థ్రిల్లర్ స్టోరీ అతడి వద్ద సిద్దంగా ఉన్నట్లు తెలిసింది. వీటికి దర్శకులు ఎవరు? అన్నది క్లారిటీ లేదు. కానీ స్టోరీలు మాత్రం రెడీగా ఉన్నాయని తెలిసింది. వాటిపై రామ్ పూర్తి సంతృప్తిగా ఉంటే దర్శకుల్ని సెట్ చేస్తే సరిపోతుంది. అలాగే రామ్ స్వయంగా ఓ స్క్రిప్ట్ సిద్దం చేస్తున్నాడు. పూర్తయితే గనుక ఈ కథతోనే రామ్ ముందుకెళ్లే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆ కథ పూర్తవ్వడానికి మరో రెండు నెలలు సమయం పడుతుందట. మరి రామ్ స్వయంగా డైరెక్ట్ చేసే అవకాశం ఉందా? అంటే అంత ఛాన్స్ ఇప్పుడే తీసుకోడు.
ప్రస్తుతం అతడు పూర్తిగా సక్సస్ పైనే దృష్టి పెట్టాడు. తను వద్ద ఉన్న కథల్ని హిట్ చేయగలిగే ప్రతిభావంతుడు కావాలి. అలాంటి వారి కోసమే సీరియస్ గా సెర్చ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సొంత స్టోరీకి ఉన్న ప్రాధన్యత ఎలాంటింది. ఇంత వరకూ రామ్ స్వయంగా స్టోరీ సిద్దం చేయలేదు. తొలిసారి సక్సెస్ కోసం కలం పట్టి కథ రాస్తున్నాడు. తమిళ చిత్రం `తడమ్` రీమేక్‌గా వచ్చిన `రెడ్` సినిమా విష యంలో, తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా కొన్ని మార్పులు చేయడంలో రామ్ తన ఇన్పుట్స్ ఇచ్చారని అప్పట్లో వార్తలు వచ్చాయి.
తన పెర్ఫార్మెన్స్‌కు స్కోప్ ఉండేలా సీన్లను డిజైన్ చేయించుకోవడంలో ఆయనకు మంచి అవగాహన ఉంది. ఆరకంగా `రెడ్` లో వర్కౌట్ అయింది. ఆ సినిమా విజయం సాధించనప్పటికీ స్టైలిష్ మేకింగ్ ఆకట్టుకుంది. `శివమ్`, `హైపర్` వంటి సినిమాల స్క్రిప్ట్ డెవలప్‌మెంట్ సమయంలో రామ్ టీంతో కలిసి వర్క్ చేశారని ఇండస్ట్రీ టాక్ ఉంది. అలాగే టెక్నాలజీ, ఎడిటింగ్ , షాట్ మేకింగ్ మీద రామ్ కు మంచి పట్టు ఉంది. ఆ ట్యాలెంట్ అంతా సొంత కథపై ప్రయోగించే అవకాశాలైతే కనిపిస్తున్నాయి.
