చరణ్ 'పెద్ది'.. US టార్గెట్ అన్ని కోట్లా?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లీడ్ రోల్ లో నటిస్తున్న పెద్ది మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
By: Tupaki Desk | 10 Feb 2026 5:00 PM ISTమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లీడ్ రోల్ లో నటిస్తున్న పెద్ది మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. విలేజ్ బ్యాక్ డ్రాప్ తో స్పోర్ట్స్ డ్రామాగా బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాపై ఇప్పటికే ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సమ్మర్ స్పెషల్ గా ఏప్రిల్ 30వ తేదీన మూవీ.. ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ కానుంది.
అయితే ఇప్పుడు పెద్ది థియేట్రికల్ బిజినెస్ గురించి సోషల్ మీడియాతోపాటు సినీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఇప్పటికే దాదాపు అంతా ఖరారైనట్లు వార్తలు వస్తున్నాయి. డిస్ట్రిబ్యూటర్స్ నుంచి పెద్ద ఎత్తున ఆఫర్స్ వస్తుండడంతో మేకర్స్.. డీల్స్ ను ఆల్మోస్ట్ కంప్లీట్ చేసినట్లు వినికిడి. ముఖ్యంగా నార్త్ అమెరికా రైట్స్ పై ఇప్పుడు అంతా మాట్లాడుకుంటున్నారు.
నార్త్ యూఎస్ లో పెద్ది బ్రేక్ ఈవెన్ టార్గెట్ సుమారు 7 మిలియన్ డాలర్స్ గా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. రూ.63 కోట్లకు పైగా అక్కడ పెద్ది రాబట్టాలని వార్తలు వస్తున్నాయి. అయితే అదేం చిన్న నెంబర్ కాదు. రామ్ చరణ్ సోలో హీరోగా నటించిన సినిమాల్లో యూఎస్ మార్కెట్ లో ఇప్పటివరకు ఎప్పుడూ లేని హైయెస్ట్ టార్గెట్ ఇదే కావడం విశేషం. దీంతో పెద్ది మూవీకి ఎలాంటి డిమాండ్ ఉందో అర్థమవుతోంది.
అయితే ఆ డీల్ నెంబర్ నిజమైతే.. నార్త్ యూఎస్ లో పెద్ది మూవీ పెద్ద ఎత్తున వసూళ్లు సాధించాలి. భారీ ఓపెనింగ్స్ ను రాబట్టాలి. ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లు స్ట్రాంగ్ ఉండటంతో పాటు సినిమాకు ఆడియన్స్ నుంచి సూపర్ పాజిటివ్ టాక్ రావడం కీలకం. అప్పుడే ఆ రేంజ్ లో కలెక్షన్లు వచ్చి.. బాక్సాఫీస్ వద్ద బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను మూవీ అందుకుంటుందనే చెప్పడంలో డౌట్ అక్కర్లేదు.
అదే సమయంలో సినిమాలోని కంటెంట్ బాగుంటే.. భారీ వసూళ్లు సాధిస్తే.. పెద్ది రామ్ చరణ్ కెరీర్ లో మరో మైల్ స్టోన్ మూవీగా నిలవనంది. యూఎస్ బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టించే ఛాన్స్ కూడా ఉంది. దీంతో ఇప్పుడు అందరి దృష్టి పెద్దిపై పడింది. మరి రామ్ చరణ్ ఓవర్సీస్ మార్కెట్ రేంజ్ ను ఆ సినిమా ఫలితం ఎంత వరకు పెంచుతుందో అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.
ఇక సినిమా విషయానికొస్తే.. రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ నటిస్తున్నారు. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, సీనియర్ నటుడు జగపతి బాబు, బాలీవుడ్ నటుడు దివ్యేందు శర్మ సహా పలువురు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. వృద్ధి సినిమాస్ బ్యానర్ పై సతీష్ కిలారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పిస్తున్నాయి.
