సింగపూర్ కు తరలిన రామ్ చరణ్ విత్ రైమ్!
'రామ్ చరణ్ విత్ రైమ్' మైనపు విగ్రహాన్ని ఇటీవల లండన్ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం ఎంతో వైభవంగా జరిగింది.
By: Tupaki Desk | 21 May 2025 4:21 PM IST'రామ్ చరణ్ విత్ రైమ్' మైనపు విగ్రహాన్ని ఇటీవల లండన్ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం ఎంతో వైభవంగా జరిగింది. చరణ్ తల్లిదండ్రులు, భార్య ఉపాసన అంతా లాంచింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. తనయుడి మైనపు విగ్రహాన్ని చూసుకుని చిరంజీవి తండ్రిగా ఎంతో గర్వపడ్డారు. తాను సైతం సాధించాలేనివి ఎన్నో తనయుడి సాధిస్తున్నాడని చూసి ఎంతో సంతోష పడ్డారు.
తల్లి సురేఖ సంతోషం మాటల్లో చెప్పలేనిది. పట్టరాని ఆనందంలో భార్య ఉపాసన కనిపించారు. అంతా విగ్రహం పక్కనే కూర్చుని ఫోటోలు దిగారు. క్వీన్ ఎలిజబెత్ II తర్వాత తన పెంపుడు జంతువుతో విగ్రహాన్ని ఆవిష్కరించే అవకాశం కేవలం రామ్ చరణ్ కు మాత్రమే దక్కడం విశేషం. అలా చరణ్ చరిత్రలో నిలిచిపోయాడు. తాజాగా ఈ విగ్రహాన్ని లండన్ మ్యూజియం నుంచి సింగపూర్ మేడమ్ టుస్సాడ్స్ కు శాశ్వతంగా తరలించారు.
దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ప్రస్తుతం స్థానికంగా ఉన్న సింగపూర్ ప్రజ లం తా చరణ్ విగ్రహాన్ని చూడటానికి తరలి వెళ్తున్నారు. ప్రజల సందర్శనార్దం సింగపూర్ మ్యూజియంలో వి గ్రహం అందుబాటులో ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా `పెద్ది` చిత్రా న్ని బుచ్చిబాబు తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే.
ఇప్పటికే కొంత భాగం షూటింగ్ పూర్తయింది. రిలీజ్ అయిన చరణ్ మాస్ లుక్ ఆద్యంత ఆకట్టు కుం టుంది. ప్రస్తుతం షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. చరణ్ ఇంకా తిరిగి షూట్ లో జాయిన్ అవ్వలేదు. త్వరలోనే టీమ్ తో కలవనున్నాడు.
