మెగా ఆల్బమ్‌లో ఎక్స్‌క్లూజివ్ ఫోటో
తాజాగా చరణ్ మైనపు విగ్రహావిష్కరణలో రేర్ క్లిక్స్ ఇంటర్నెట్ లోకి వచ్చాయి. వీటిలో చరణ్ విగ్రహంతో మెగా కుటుంబం ఫోటోలు దిగింది.
By: Tupaki Desk | 12 May 2025 11:28 PM ISTటాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ గ్లోబల్ ఐకన్ గా తనను తాను ఆవిష్కరించుకున్నారు. ఆర్.ఆర్.ఆర్ లో సీతారామరాజుగా అతడి నటనపై ప్రపంచవ్యాప్తంగా సినీదిగ్గజాలు ప్రశంసల వర్షం కురిపించారు. ఇంతకుముందు ఆస్కార్స్ అవార్డుల వేదికపై మెరిసిన చరణ్ కి ఇప్పుడు పాశ్చాత్య దేశాల్లోను అసాధారణ ఫాలోయింగ్ ఏర్పడింది. చరణ్ నటిస్తున్న సినిమాలకు విదేశాలలోను మార్కెట్ ఏర్పడింది.
ఇలాంటి సమయంలో అతడికి మరో అరుదైన గౌరవం గుర్తింపు దక్కాయి. లండన్ మ్యాడమ్ టుస్సాడ్స్ లో చరణ్ మైనపు విగ్రహ ఆవిష్కరణతో అతడి కీర్తి ప్రతిష్ఠలు మరింతగా పెరిగాయి. ప్రపంచం దృష్టి ఇప్పుడు అతడిపై మరింతగా ప్రసరిస్తోంది. ప్రభాస్, మహేష్, అల్లు అర్జున్ తర్వాత చరణ్ కి ఇలాంటి అరుదైన అవకాశం దక్కింది. ఇప్పుడు ఈ జాబితాలో చరణ్ చేరాడు. అతడి మైనపు విగ్రహం అద్భుతంగా కుదిరింది! అంటూ కితాబు అందుకున్నాడు.
తాజాగా చరణ్ మైనపు విగ్రహావిష్కరణలో రేర్ క్లిక్స్ ఇంటర్నెట్ లోకి వచ్చాయి. వీటిలో చరణ్ విగ్రహంతో మెగా కుటుంబం ఫోటోలు దిగింది. సకుటుంబ సపరివార సమేతంగా మెగా క్లిక్ ఉత్సుకతను పెంచింది. చరణ్, చిరు, ఉపాసన, సురేఖ, క్లిన్ కారా, రైమ్ ఈ ఫోటోగ్రాఫ్ లో కనిపించారు. ఈ ఫోటోలలో చరణ్ కంటే యంగ్ గా కనిపించిన చిరు షో స్టాపర్ గా నిలిచారు. తక్షణమే ఈ ఫోటో ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతోంది.
