సత్య కాళ్లపై పడబోయిన చరణ్.. వ్వాటే సింప్లిసిటీ
ఈ ఫన్నీ వీడియోలో ప్రదీప్ సత్య కాంబో మరోసారి తమ హ్యూమర్ తో నవ్వులు పూయించగా, చెర్రీ మాత్రం తన అద్భుతమైన సరదా రియాక్షన్‌తో ఆకట్టుకున్నాడు.
By: Tupaki Desk | 10 April 2025 9:38 AM ISTయాంకర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రదీప్ మాచిరాజు మరోసారి హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' అనే ఈ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ శుక్రవారం విడుదల కానుంది. ఈ సినిమాకు ఢీ షో క్రియేటర్స్ నితిన్ భరత్ లాంటి డైరెక్టర్లు మెగాఫోన్ పట్టారు. దీపికా పిల్లి హీరోయిన్‌గా నటించగా, మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, ఎమోషనల్ ఎలిమెంట్స్ అన్నీ బలంగా ఉండేలా సినిమా రూపొందిందని టాక్.
ఇక సమ్మర్ స్పెషల్‌గా రిలీజ్ కాబోతున్న ఈ చిత్రానికి తాజాగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మద్దతుగా నిలిచారు. ఇప్పటికే మహేష్ బాబు ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ సాంగ్‌ను లాంచ్ చేయడం, దానికి మంచి రెస్పాన్స్ రావడంతో ఈ చిత్రం మొదటి నుంచి బజ్ తెచ్చుకుంది. టీజర్, ట్రైలర్, మిగతా పాటలు సైతం యూట్యూబ్ లో దూసుకెళ్లాయి. అయితే సినిమా రిలీజ్ సమీపిస్తుండటంతో మరింత హైప్ క్రియేట్ చేసేలా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సపోర్ట్ కోసం ముందుకొచ్చారు. దీనికి మద్దతుగా రిలీజ్ చేసిన ప్రమోషనల్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ ఫన్నీ వీడియోలో ప్రదీప్ సత్య కాంబో మరోసారి తమ హ్యూమర్ తో నవ్వులు పూయించగా, చెర్రీ మాత్రం తన అద్భుతమైన సరదా రియాక్షన్‌తో ఆకట్టుకున్నాడు. వీడియోలో సత్య చెర్రీ కాళ్లు మొక్కినపుడు, చరణ్ సత్య కాళ్లకు నమస్కరించడం అభిమానులను ఆశ్చర్యపరిచేలా చేసింది. ఈ చిన్న సీన్ ద్వారా చెర్రీ ఎంత హ్యుమానిటీ కలిగిన వ్యక్తో నిరూపించుకున్నారు. "ఇంత పెద్ద స్టార్ హీరో అయ్యి.. ఇలా ఒదిగి ప్రవర్తించడం నిజంగా గొప్ప విషయం" అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
ఫస్ట్ టికెట్ ను చెర్రీ చేతుల మీదుగా లాంచ్ చేయించడమే కాకుండా, “మిగతా కలెక్షన్స్ ప్రేక్షకులే ఇస్తారు” అనే స్టేట్‌మెంట్ తో ప్రదీప్ మూవీపై మరింత ఆసక్తి పెంచారు. ఈ సినిమాలో కమెడియన్ సత్యకి ప్రత్యేక పాత్ర ఉందని టాక్. ఇక ప్రదీప్ మాత్రం రెండేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ హీరోగా ఓ మంచి సినిమాతో వస్తున్నాడనే క్రమంలో ఈ ప్రమోషనల్ పుష్ సినిమాకు బాగా వర్కౌట్ అయ్యేలా కనిపిస్తోంది.
ఇటీవలే మహేష్ బాబు ప్రమోట్ చేయడంతో ఫ్యామిలీ ఆడియన్స్, యువత సినిమా పట్ల సానుకూలంగా ఉన్నారు. ఇప్పుడు మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన సపోర్ట్‌తో మాస్, మెగా ఫ్యాన్స్ సైతం హాల్‌కెక్కే అవకాశం ఉంది. అయితే ఇదంతా బజ్‌ని పెంచే పనైతే, సినిమా కంటెంట్ ఎలా ఉందన్నది ఓపెనింగ్ తర్వాతే తేలనుంది. మంచి మౌత్ టాక్ వస్తే, ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ అవుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
