Begin typing your search above and press return to search.

అఖిల్ రిసెప్ష‌న్లో చ‌రణ్‌-సుకుమార్ హైలైట్ అయ్యార‌లా!

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌థానాయ‌కుడిగా క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ తెర‌కెక్కించిన `రంగ‌స్థ‌లం` ఎంత పెద్ద విజ‌యం సాధించిందో తెలిసిందే.

By:  Tupaki Desk   |   9 Jun 2025 10:03 AM
అఖిల్ రిసెప్ష‌న్లో చ‌రణ్‌-సుకుమార్ హైలైట్ అయ్యార‌లా!
X

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌థానాయ‌కుడిగా క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ తెర‌కెక్కించిన `రంగ‌స్థ‌లం` ఎంత పెద్ద విజ‌యం సాధించిందో తెలిసిందే. ఇద్ద‌రి కెరీర్ లోనూ అదోక మైల్ స్టోన్ మూవీ. మ‌ళ్లీ అలాంటి చిత్రం ఆకాంబినేష‌న్ లోనైనా సాధ్య‌మ‌వుతుందా? అంటే చెప్ప‌లేం. ఎందుకంటే కొన్ని కొన్ని అనుకో కుండా అలా కుదిరాత‌యంటారు. అయినా ఇరువురు మ‌రో ప్ర‌య‌త్నం చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

ఆర్సీ 17వ చిత్రం సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలోనూ రూపొందుతుంది. ఆర్సీ 16 అనంత‌రం సుకుమార్ ప్రాజెక్ట్ మొద‌లవుతుంది. ఆ సంగ‌తి ప‌క్క‌న బెడితే తాజాగా `రంగ‌స్థ‌లం` జోడీలు అఖిల్ -జైనాబ్ రావ్జీల రిసెప్ష‌న్ వేడుక‌లో హైలైట్ అయ్యారు. న‌వ దంప‌తుల‌తో చ‌ర‌ణ్ స‌తీమ‌ణ‌ సుకుమార్ స‌తీమ‌ణి క‌లిసి ఫోటోలు దిగారు. ఇది చాలా రేర్ మూవ్ మెంట్. భార్యామ‌ణుల‌తో క‌ల‌వ‌డం అన్న‌ది ఎప్పుడో గానీ జ‌ర‌గ‌దు.

ఇలాంటి వేడుక‌ల స‌మ‌యంలో త‌ప్ప‌. ఆ జోడీలు ఎంతో అందంగా నెట్టింట హైలైట్ అవుతున్నాయి. సుకుమార్ బ్లాక్ అండ్ బ్లాక్ ధ‌రించగా స‌తీమ‌ణి త‌బితా ఎరుపు వ‌ర్ణం చీర‌, ర‌విక‌లో త‌ళుకులీనారు. ఆమె ధ‌రించిన యాక్స‌రీస్ నెక్ ని మ‌రింత అందంగా తీర్చిదిద్దాయి. ఇక చ‌ర‌ణ్ బ్లూ క‌ల‌ర్ ప్యాంట్ పై వైట్ ష‌ర్ట్ ధ‌రించి పైన బ్లూ క‌ల‌ర్ కోట్ ధ‌రించాడు. ఉసాస‌న వైట్ డిజైన్ దుస్తుల్లో అందంగా ముస్తాబ‌య్యారు. ఈ న‌లుగురు ఒకే ప్రేమ్ లో క‌నిపించ‌డం విశేషం.

ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైర‌ల్ గా మారింది. ప్ర‌స్తుతం రామ్ చ‌ర‌ణ్ పెద్ది సినిమాతో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రాన్ని సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు తెర‌కెక్కిస్తున్నాడు. అన్ని ప‌నులు పూర్తి చేసుకుని వ‌చ్చే ఏడాది మార్చిలో రిలీజ్ అవుతుంది. అటుపై సుకుమార్ చిత్రం షూటింగ్ లో చ‌ర‌ణ్ జాయిన్ అవుతాడు.