Begin typing your search above and press return to search.

రామ్ చరణ్ కోసం ఆమెను దించుతున్నారా మాస్టర్?

సినిమాపై ఆడియెన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి. కచ్చితంగా చరణ్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటారని అంతా ఫిక్స్ అయ్యారు. వచ్చే ఏడాది మార్చిలో పెద్ది రిలీజ్ కానుంది.

By:  Tupaki Desk   |   22 Sept 2025 10:13 PM IST
రామ్ చరణ్ కోసం ఆమెను దించుతున్నారా మాస్టర్?
X

టాలీవుడ్ స్టోర్ హీరో రామ్ చరణ్.. ఇప్పుడు పెద్ది మూవీతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ లో గ్రామీణ క్రీడా నేపథ్యంతో రూపొందుతున్న ఆ సినిమాలో నెవ్వర్ బిఫోర్ అనేలా చరణ్ కనిపించనున్నారు. ఇప్పటికే ఆయన లుక్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.

సినిమాపై ఆడియెన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి. కచ్చితంగా చరణ్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటారని అంతా ఫిక్స్ అయ్యారు. వచ్చే ఏడాది మార్చిలో పెద్ది రిలీజ్ కానుంది. అయితే ఆ మూవీ కంప్లీట్ అయ్యాక చరణ్.. ప్రముఖ దర్శకుడు సుకుమార్ తో వర్క్ చేయనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ప్రస్తుతం సుక్కు మాస్టర్ స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నారని సమాచారం.

ఆ తర్వాత ప్రీ ప్రొడక్షన్స్ పనులు పూర్తి చేసి.. సినిమాను మొదలుపెట్టనున్నారని తెలుస్తోంది. అయితే ఇప్పటికే సుకుమార్, చరణ్ కాంబినేషన్ లో వచ్చిన రంగస్థలం సినిమా ఎలాంటి హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చెర్రీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ మూవీస్ లో ఒకటిగా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. సినీ ప్రియులను ఎంతో మెప్పించింది.

దీంతో ఇప్పుడు చరణ్, సుకుమార్ కాంబో రిపీట్ అవ్వడంతో అప్పుడే అందరిలో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఇప్పుడు ఆ మూవీలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీని ఫిక్స్ చేయనున్నారని ప్రచారం జరుగుతోంది. బీ టౌన్ బ్యూటీ కృతి సనన్.. చరణ్ సరసన యాక్ట్ చేయనున్నారని టాక్ వినిపిస్తోంది.

చర్చలు తుది దశలో ఉన్నప్పటికీ.. అధికారిక ప్రకటన త్వరలో రానుందని వినికిడి. అయితే ఇప్పటికే తెలుగు చిత్రాల్లో నటించిన కృతి.. రామ్ చరణ్ తో మాత్రం ఇదే తొలిసారి. అదే సమయంలో ఇప్పటి వరకు తెలుగు సినిమాలతో కృతికి ఆశించిన విజయాలు దక్కలేదు. మహేశ్ బాబు సరసన 1–నేనొక్కడినే (2014)తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది అమ్మడు.

ఆ తర్వాత నాగచైతన్యతో దోచెయ్ (2015), ప్రభాస్‌ తో ఆదిపురుష్ (2023) చిత్రాల్లో నటించినా బాక్సాఫీస్ వద్ద ఏదీ విజయాన్ని సాధించలేదు. ఆమె యాక్టింగ్ కు కూడా మిశ్రమ స్పందనలే వచ్చాయి. అయితే సుకుమార్ దర్శకత్వంలో మళ్లీ అవకాశం రావడం కృతికి మంచి ఛాన్స్ అని చెప్పాలి. ఇప్పటికే సుకుమార్ తో నేనొక్కడినే మూవీకి గాను వర్క్ చేసింది. ఇప్పుడు ఆమె నిజంగా మళ్ళీ ఆయనతో వర్క్ చేస్తుందో లేదో.. హిట్ అందుకుంటుందో లేదో వేచి చూడాలి.