Begin typing your search above and press return to search.

చ‌ర‌ణ్ కోసం రంగంలోకి సుక్కూ

RRR లాంటి పాన్ ఇండియా సెన్సేష‌న త‌ర్వాత‌ మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్ త‌న గేమ్‌ని మ‌రో స్థాయికి తీసుకెళ్లాల‌ని ప్ర‌య‌త్నించాడు.

By:  Tupaki Desk   |   30 April 2025 9:30 PM
Ram Charan Teams Up with Sukumar for a Pan-India Blockbuster
X

RRR లాంటి పాన్ ఇండియా సెన్సేష‌న త‌ర్వాత‌ మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్ త‌న గేమ్‌ని మ‌రో స్థాయికి తీసుకెళ్లాల‌ని ప్ర‌య‌త్నించాడు. కానీ శంక‌ర్ తో `గేమ్ ఛేంజ‌ర్` బిగ్ బ్రేక్ వేసింది. ఈ సినిమాతో చ‌ర‌ణ్ ఊహించ‌ని డిజాస్ట‌ర్‌ని ఎదుర్కొన్నాడు. ప్ర‌స్తుతం దీనిని స‌రి చేసేందుకు సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబుతో `పెద్ది` లాంటి స్పోర్ట్స్ డ్రామాలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాని కూడా పాన్ ఇండియా మార్కెట్లో విడుద‌ల చేయాల‌నేది ప్లాన్.

పెద్ది త‌ర్వాత నెక్ట్స్ ఏంటి? అంటే.. దానికి కూడా చ‌ర‌ణ్ వ‌ద్ద‌ స‌మాధానం ఉంది. త‌దుప‌రి పుష్ప ఫ్రాంఛైజీతో సంచ‌ల‌నాలు సృష్టించిన సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో భారీ పాన్ ఇండియా చిత్రంలో న‌టించేందుకు చ‌ర‌ణ్ సిద్ధంగా ఉన్నాడు. దీనికోసం సుకుమార్ రైటింగ్స్ టీమ్ ఇప్ప‌టికే స‌న్నాహ‌కాల్లో ఉంద‌ని స‌మాచారం. సుకుమార్ ప్ర‌స్తుతం విరామంలో ఉన్నాడు. పుష్ప‌, పుష్ప 2 చిత్రాల సుదీర్ఘ షెడ్యూళ్ల‌తో ఫుల్ స్ట్రెయిన్ అయిన త‌ర్వాత‌ కొంత‌కాలంగా మైండ్ ని రీఫ్రెష్ చేస్తున్నాడు. త‌న మైండ్ లో ఆలోచ‌న‌ల‌కు అత‌డు గ్యాప్ ఇచ్చాడు. సుకుమార్ మరో నెల రోజుల పాటు ఇదే స్థితిలో విశ్రాంతి తీసుకుంటాడు. ప్రాజెక్ట్ లోకి దిగే ముందు ఈ విరామంలో అత‌డు పూర్తిగా రీఛార్జ్ అవుతాడు.

జూన్ 2025 నుండి సుకుమార్ రైటింగ్స్ ర‌చనా బృందం బ‌రిలో దిగుతుంది. అప్ప‌టి నుంచి సుక్కూ పూర్తిగా చ‌ర‌ణ్ ప్రాజెక్ట్ కోసం అంకిత‌మవుతాడ‌ని గుస‌గుస వినిపిస్తోంది. రామ్ చ‌ర‌ణ్‌కి పాన్ ఇండియ‌న్ హిట్ ఇవ్వ‌డ‌మే ధ్యేయంగా సుకుమార్ ప‌ని చేస్తాడని తెలుస్తోంది. సుకుమార్- చ‌ర‌ణ్ కాంబినేష‌న్ అన‌గానే తొలుత `రంగ‌స్థ‌లం` గుర్తుకు వ‌స్తుంది. ఆ సినిమా క‌మ‌ర్షియ‌ల్ గా బ్లాక్ బ‌స్ట‌ర్ సాధించ‌డ‌మే గాక‌, జాతీయ అవార్డు కూడా అందించింది. న‌టుడిగా చ‌ర‌ణ్ కి కొత్త ఇమేజ్ ని ఇచ్చిన సినిమా ఇది. అందుకే ఈ జోడీ మ‌రోసారి ఎలాంటి మ్యాజిక్ సృష్టిస్తుందో చూడాల‌నే ఆస‌క్తి అంద‌రిలో ఉంది.