Begin typing your search above and press return to search.

#ఆర్సీ 18 సంచ‌ల‌నం సందీప్ తోనా?

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ సైతం సందీప్ రెడ్డి వంగా తో సినిమా చేయ‌డానికి సిద్దంగా ఉన్న న‌టుడు. 'యానిమల్' స‌క్సెస్ అనంత‌రం సందీప్ రెడ్డిపై చ‌ర‌ణ్ కూడా ప‌ని చేయ‌డానికి ఆస‌క్తిని వ్య‌క్తం చేసాడు.

By:  Tupaki Desk   |   30 May 2025 1:30 PM
#ఆర్సీ 18 సంచ‌ల‌నం సందీప్ తోనా?
X

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ సైతం సందీప్ రెడ్డి వంగా తో సినిమా చేయ‌డానికి సిద్దంగా ఉన్న న‌టుడు. 'యానిమల్' స‌క్సెస్ అనంత‌రం సందీప్ రెడ్డిపై చ‌ర‌ణ్ కూడా ప‌ని చేయ‌డానికి ఆస‌క్తిని వ్య‌క్తం చేసాడు. అందుకు సందీప్ రెడ్డి కూడా పాజిటివ్ గా స్పందించాడు. త‌ప్ప‌కుండా ఇద్దరం కలిసి ఓ సినిమా చేద్దాం అన్న‌ట్లు మాట్లాడాడు. మరి ఈ ద్వ‌యం సినిమాకు స‌న్నాహాలు మొద‌ల‌య్యాయా? అంటే అవున‌నే తెలుస్తోంది.

ఆర్సీ 18 సందీప్ రెడ్డితోనే చ‌ర‌ణ్ చేసేలా పావులు క‌దుపుతున్నాడట‌. ఇటీవ‌లే చ‌ర‌ణ్‌-సందీప్ ఓ హోట‌ల్ పార్టీలో క‌లిసారట‌. ఆ స‌మ‌యంలో ఇద్ద‌రి మ‌ధ్య సినిమా టాపిక్ వ‌చ్చింద‌ని చ‌ర‌ణ్ స‌న్నిహిత వ‌ర్గాల నుంచి తెలిసింది. సూప‌ర్ స్టార్ మ‌హేష్ కోసం రాసిన స్క్రిప్ట్ సిద్దంగా ఉంద‌ని చ‌ర‌ణ్ ఒకే అంటే సందీప్ వినిపించ‌డానికి సిద్దంగా ఉన్నాడ‌ని తెలిసింది. అయితే ఈ స్క్రిప్ట్ ను మ‌హేష్ రిజెక్ట్ చేసిన సంగతి తెలిసిందే.

అందులో మ‌హేష్ పాత్ర 'యానిమ‌ల్' లో ర‌ణ‌బీర్ క‌పూర్ రోల్ క‌న్నా రెండింత‌లు డ‌బుల్ డోస్ తో ఉంటుంద‌ని చెప్పారు. మ‌రి ఆ క‌థకి చ‌ర‌ణ్ సెట్ అవుతాడా? లేదా? అన్న‌ది చూడాలి. కథ సంగ‌తి ప‌క్క‌న బెడితే చ‌ర‌ణ్ 18వ సినిమా మాత్రం సందీప్ రెడ్డితోనే ఉండాల‌ని భావిస్తున్నాడట‌. ప్ర‌స్తుతం సందీప్ రెడ్డి 'స్పిరిట్' ప‌నుల్లో బిజీగా ఉన్నాడు. ప్ర‌భాస్ తో ఈ చిత్రాన్ని వీలైనంత త్వ‌రగా ప‌ట్టాలెక్కించాల‌ని సిద్ద‌మవుతున్నాడు.

అతి త్వ‌ర‌లోనే మొద‌ల‌వుతుంది. ఇది పూర్తి చేసి రిలీజ్ చేయ‌డానికి రెండేళ్ల‌కు పైగా స‌మ‌యం ప‌డుతుంది. అటు రామ్ చ‌ర‌ణ్ ఆర్సీ 16 లో న‌టిస్తున్నాడు. ఈ సినిమా వ‌చ్చే ఏడాది సంక్రాతికి రిలీజ్ అవుతుంది. అటుపై ఆర్సీ 17 సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో మొద‌ల‌వుతుంది. ఈ సినిమా కూడా రిలీజ్ అవ్వ‌డానికి రెండేళ్ల‌కు పైగా స‌మ‌యం ప‌డుతుంది. అప్ప‌టికి సందీప్ రెడ్డి సినిమా కూడా రిలీజ్ అవుతుంది. కాబ‌ట్టి ఈ కాంబోలో సినిమాకు ఎక్కువ అవ‌కాశాలున్నాయి.