చరణ్-జాన్వీ ఒకేసారి రంగంలోకి!
మెగా పవర్ రామ్ చరణ్, జాన్వీకపూర్ జంటగా బుచ్చిబాబు దర్శకత్వంలో `పెద్ది` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 11 May 2025 8:30 PMమెగా పవర్ రామ్ చరణ్, జాన్వీకపూర్ జంటగా బుచ్చిబాబు దర్శకత్వంలో `పెద్ది` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. చిత్రీకరణ మొదలైన నాటి నుంచి మొన్నటి వరకూ నిర్విరామంగా షూటింగ్ జరిగింది. చరణ్...జాన్వీ సహా ప్రధాన పాత్రధారులపై కీలక షెడ్యూల్స్ పూర్తి చేసారు. జాన్వీ పార్ట్ కొంత వరకూ పూర్తవ్వడంతో అమ్మడు కొన్ని రోజులుగా ముంబైలోనే ఉంటుంది. ప్రస్తుతం షూటింగ్ కి బ్రేక్ పడింది. రామ్ చరణ్ లండన్ టూర్ లో ఉన్నాడు.
అక్కడ మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో చరణ్ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరణ నేపథ్యంలోనే లండన్ వెళ్లాల్సి వచ్చింది. ఈ కార్యక్రమం అనంతరం ప్రతిష్టాత్మక రాయల్ ఆల్బర్ట్ హాల్‌లో స్పెషల్ లైవ్ కాన్సర్ట్ లో జాయిన్ అవుతాడు. చరణ్ తో పాటు `ఆర్ ఆర్ ఆర్` బృందం కూడా ఈవెంట్ లో పాల్గొంటుంది. ఎన్టీఆర్... రాజమౌళి కూడా ఇప్పటికే లండన్ చేరుకున్నారు. ఈవెంట్ అనంతరం చరణ్ నేరుగా హైదరా బాద్ కు చేరుకుంటాడు.
దీనిలో భాగంగా బుచ్చిబాబు తదుపరి షెడ్యూల్ కి రెడీ అవుతున్నాడు. ఈనెల 15 నుంచి తిరిగి షూటింగ్ ప్రారంభమవుతుంది. కొత్త షెడ్యూల్ మళ్లీ చరణ్-జాన్వీ తోనే మొదలవుతుందని సమాచారం. ఇద్దరి కాంబినేషన్ లో మరికొన్ని సన్నివేశాల చిత్రీకరించనున్నారు. దీంతో జాన్వీ పార్ట్ ముగింపు దశకు చేరు కుంటుందని సమాచారం. టాకీ పార్ట్ అనంతరం మళ్లీ జాన్వీ చరణ్ కాంబినేషన్ లో వచ్చే పాటలకు సంబంధించి షూట్ లో పాల్గొనాల్సి ఉంటుంది.
ఇప్పటికే సంగీత దర్శకుడు పాటలు సిద్దం చేసినట్లు తెలుస్తోంది. పాటల షూట్ పూర్తయితే జాన్వీ హైదరా బాద్ నుంచి మూవ్ అవుతుంది. `పెద్ది` చిత్రీకరణలో భాగంగా షూటింగ్ మొదలైన నాటి నుంచి ఎక్కువగా హైదరాబాద్ లోనే ఉంటుంది. అవసరం మేర ముంబై వెళ్లొస్తోన్న సంగతి తెలిసిందే.