'రాముడు పిలిస్తే ఎక్కడికైనా వస్తా'.. రావణ దహనంలో చరణ్
అయితే రామ్ చరణ్ చేసిన వ్యాఖ్యలు కూడా అందరినీ ఆకట్టుకున్నాయి. సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.
By: Tupaki Desk | 4 Oct 2025 10:42 PM ISTదేశవ్యాప్తంగా దసరా ఉత్సవాలు ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. విజయ దశమిలో కీలక ఘట్టమైన రావణాసురుడి దహన కార్యక్రమాన్ని ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో అట్టహాసంగా నిర్వహించారు. అందులో మన టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ కూడా పాల్గొనడం విశేషం. మన సంస్కృతిలో భాగమైన రావణ దహనాన్ని చేపట్టారు.
అయితే దిల్లీలోని ఐకానిక్ రాంలీలా మైదానంలో జరిగిన దసరా వేడుకల్లో సందడి చేశారు రామ్ చరణ్. ఆర్చరీ ప్రీమియర్ లీగ్ (APL)ను దసరా శుభ సందర్భంగా ప్రారంభించిన ఆయన.. ఆ తర్వాత రావణ దహనంలో పాల్గొన్నారు. రామ బాణం ఎక్కుపెట్టి గ్లోబల్ స్టార్.. ఘనంగా రావణ దహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
వేలాది మంది అభిమానుల మధ్య రామ్ చరణ్ చేసిన రావణాసురుడు దహన కార్యక్రమం ప్రేక్షకుల్లో ఉత్సాహం నింపింది. తన ఆప్యాయ స్వభావంతో అందరి మనసులను గెలుచుకున్నారు. అయితే రామ్ చరణ్ చేసిన వ్యాఖ్యలు కూడా అందరినీ ఆకట్టుకున్నాయి. సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.
"నా పేరు రామ్ చరణ్ తేజ్.. దాని అర్థం రాముడి పాదాల వద్ద తేజ్ ఉంటారు. తేజ్ అంటే హనుమంతుడు. రాముడు పిలిస్తే అక్కడ నేను ఉంటాను. అందుకే ఇక్కడికి వచ్చాను" అని మెగా హీరో తెలిపారు. దీంతో అక్కడ ఉన్న ఆడియన్స్.. చప్పట్లతో మైదానాన్ని హోరెత్తించారు. జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు.
అయితే చరణ్ రావణ దహనం చేసిన వీడియో.. ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. అందరినీ అట్రాక్ట్ చేస్తోంది. మెగా ఫ్యాన్స్ ఆ వీడియోను తెగ వైరల్ చేస్తున్నారు. తమ హీరో రావణ దహనం చేయడం చాలా సంతోషంగా ఉందని చెబుతున్నారు. తన వ్యాఖ్యలతో ఉత్తరాది ప్రజలను ఆకట్టుకున్నారని అంటున్నారు.
కాగా.. చరణ్ ఆర్ ఆర్ ఆర్ మూవీతో నార్త్ మూవీ లవర్స్ ను విపరీతంగా ఆకట్టుకున్నారు. తన యాక్టింగ్ తో అందరినీ మెప్పించారు. స్పెషల్ ఫ్యాన్ బేస్ ను సొంతం చేసుకున్నారు. సినిమాలో తన డైలాగ్స్, డెడికేషన్ తో దాదాపు అందరినీ మెప్పించారు. పాన్ ఇండియా వైడ్ గా గుర్తింపు సంపాదించుకున్నారు. ఇప్పుడు రావణ దహన కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
