Begin typing your search above and press return to search.

రామ్ చరణ్ రష్మిక కాంబో ఎప్పుడు..?

ఫాంలో ఉన్న హీరో సూపర్ హిట్లతో దూసుకెళ్తున్న హీరోయిన్ కలిసి చేస్తే బాగుంటుందని ఆడియన్స్ కోరుతారు. ఫలానా హీరో ఇంకా ఫలానా హీరోయిన్ కలిసి నటిస్తే బాగుంటుందని అనుకునే ఫ్యాన్స్ ఉంటారు.

By:  Tupaki Desk   |   30 Jun 2025 8:15 AM IST
రామ్ చరణ్ రష్మిక కాంబో ఎప్పుడు..?
X

ఫాంలో ఉన్న హీరో సూపర్ హిట్లతో దూసుకెళ్తున్న హీరోయిన్ కలిసి చేస్తే బాగుంటుందని ఆడియన్స్ కోరుతారు. ఫలానా హీరో ఇంకా ఫలానా హీరోయిన్ కలిసి నటిస్తే బాగుంటుందని అనుకునే ఫ్యాన్స్ ఉంటారు. తెర మీద ఈ కాంబినేషన్ అయితే బాగుంటుందని.. ఈ జోడీ అయితే అదిరిపోతుందని అనుకోవడం సహజమే. ఎందుకంటే టాలెంట్ ఉన్న హీరోయిన్స్ కి స్టార్ ఛాన్స్ లు రావడం కామన్. కానీ కొన్ని కారణాల వల్ల కొంతమంది హీరోలతో నటించడం జరగదు. ఐతే ఫాం లో ఉన్నప్పుడే అందరు హీరోలతో కనీసం ఒక సినిమా అయినా చేస్తే చూడాలని ఫ్యాన్స్ అనుకుంటారు.

ఈ క్రమంలో టాలీవుడ్ లో ఒక సూపర్ జోడీని ఆడియన్స్ ఆశిస్తున్నారు. అదెవరు అంటే గ్లోబల్ స్టార్ రాం చరణ్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న. రామ్ చరణ్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. మెగా వారసుడిగా చరణ్ సినిమా సినిమాకు తన రేంజ్ పెంచుకుంటూ వెళ్తున్నాడు. ఆర్.ఆర్.ఆర్ తో ఇంటర్నేషనల్ లెవెల్ ఆడియన్స్ ని కూడా మెప్పించాడు. ప్రస్తుతం చరణ్ పెద్ది సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ షాట్ తోనే నెక్స్ట్ లెవెల్ క్రేజ్ తెచ్చుకున్నాడు.

ఇక మరోపక్క నేషనల్ క్రష్ రష్మిక వరుస హిట్లతో దూసుకెళ్తుంది. కన్నడ నుంచి వచ్చి తెలుగులో స్టార్ క్రేజ్ తెచ్చుకున్న రష్మిక ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ లో సంచలన విజయాలు అందుకుంటుంది. అలాంటి రష్మిక గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో జత కడితే చూడాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. ఎలాంటి పాత్రకు అయినా న్యాయం చేయగల సత్తా ఉందని ప్రూవ్ చేసుకుంటూ వస్తుంది రష్మిక మందన్న.

ఐతే కెరీర్ మొదలు పెట్టింది యువ హీరోలతోనే అయినా అమ్మడు తన టాలెంట్ తో స్టార్ ఛాన్స్ లు అందుకుంది. ఇప్పుడు రష్మిక పాన్ ఇండియా లెవెల్ లో వరుస సినిమాలు చేస్తుంది. సో రష్మిక మందన్న సినిమాలో ఉందంటే అది సూపర్ హిట్ అనే టాక్ తెచ్చుకుంది. అలాంటి రష్మిక రామ్ చరణ్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటే మాత్రం సూపర్ అనేస్తున్నారు మెగా ఫ్యాన్స్. కచ్చితంగా ఈ కాంబినేషన్ ని ఎవరో ఒకరు సెట్ చేసే ఛాన్స్ ఉంది. రామ్ చరణ్ పెద్ది లో జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఆ తర్వాత సుకుమార్ తో సినిమా చేస్తున్నాడు మరి అందులో అయినా రష్మికతో జత కట్టే ఛాన్స్ ఉందా లేదా అన్నది చూడాలి.