ప్యారడైజ్ Vs పెద్ది.. నాని ప్లాన్ ఏంటో మరి?
టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ పెద్ది మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ రీసెంట్ గా వచ్చిన విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 6 April 2025 5:41 PM ISTటాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ పెద్ది మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ రీసెంట్ గా వచ్చిన విషయం తెలిసిందే. శ్రీరామనవమి సందర్భంగా మేకర్స్.. పెద్ది విడుదల తేదీని ప్రకటించారు. వచ్చే ఏడాది చరణ్ బర్త్ డే సందర్భంగా మార్చి 27వ తేదీన గ్రాండ్ గా థియేటర్లలో రిలీజ్ చేస్తున్నట్లు ఆదివారం ఉదయం అనౌన్స్ చేశారు మేకర్స్.
అయితే 2026 మార్చి 27వ తేదీ ఫ్రైడే.. ఆ తర్వాత వీకెండ్ కంటిన్యూ.. ముఖ్యంగా చరణ్ బర్త్ డే.. కాబట్టి పెద్ది మేకర్స్ సరైన డేట్ నే ఫిక్స్ చేశారని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. ఫ్యాన్స్ రచ్చ అయితే మామూలుగా ఉండదు. అటు తమ అభిమాన హీరో పుట్టినరోజు.. ఇటు సినిమా రిలీజ్.. దీంతో ఓ రేంజ్ లో సందడి చేస్తారు.
అది పక్కన పెడితే.. ఇప్పుడు పెద్ది రిలీజ్ కు ముందు రోజు.. నేచురల్ స్టార్ నాని ప్యారడైజ్ మూవీ రిలీజ్ కానుంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా విడుదల తేదీని ఇటీవల ప్రకటించారు మేకర్స్. 2026 మార్చి 26న రిలీజ్ చేస్తామని తెలిపారు. దాంతోపాటు గ్లింప్స్ కూడా రిలీజ్ చేసి అందరిలో భారీ అంచనాలు క్రియేట్ చేశారు.
ఇప్పుడు పెద్ది మేకర్స్.. ఫస్ట్ షాట్ పేరుతో గ్లింప్స్ రిలీజ్ చేసి సినిమాపై వేరే లెవెల్ హైప్ క్రియేట్ చేశారు. చరణ్ ను ఓ రేంజ్ లో చూపించి ఫిదా చేశారు. దీంతో ఇప్పుడు రెండు మూవీలపై భారీ హోప్స్ పెట్టుకున్నారు ఆయా హీరోల ఫ్యాన్స్. కానీ రెండు సినిమాల మధ్య పోటీ ఉండడంతో బాక్సాఫీస్ పరంగా ఇబ్బంది కచ్చితంగా ఉంటుంది.
రెండు సినిమాలకు వసూళ్లు తగ్గుతాయి. దీంతో ఇప్పుడేం జరుగుతుందోనని నెటిజన్లు డిస్కస్ చేసుకుంటున్నారు. నాని అండ్ ప్యారడైజ్ మేకర్స్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని మాట్లాడుకుంటున్నారు. అయితే నాని తన సినిమాల విషయంలో చాలా కేర్ తీసుకుంటారు. అన్ని విషయాల్లో ముందుచూపుతో వెళ్తారు.
కాబట్టి ప్యారడైజ్ రిలీజ్ డేట్ ను ఛేంజ్ చేసేలా ప్లాన్ చేస్తారని కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు చరణ్ తో పోటీకి దిగే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు. ఏదేమైనా ఇంకో ఏడాది సమయం ఉంది. ఈలోపు ఏమైనా జరగొచ్చు. మెయిన్ గా ఇంకా ప్యారడైజ్ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కాలేదు. పెద్ది చిత్రీకరణ 25 శాతం కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. మరి ప్యారడైజ్ మేకర్స్ ఏం చేస్తారో వేచి చూడాలి.
