Begin typing your search above and press return to search.

చరణ్ 'పెద్ది'.. సరైన ట్రైలర్ కట్ పడితే..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం పెద్దిపై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి.

By:  Tupaki Desk   |   4 May 2026 11:05 AM IST
చరణ్ పెద్ది.. సరైన ట్రైలర్ కట్ పడితే..
X

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం పెద్దిపై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటికే విడుదల తేదీగా జూన్ 4ని ఫిక్స్ చేసిన నేపథ్యంలో ఇప్పుడు మేకర్స్ దృష్టి మొత్తం ట్రైలర్‌ పై పడింది. ఇప్పుడు వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ఆ మూవీ ట్రైలర్‌ ను మే 17 లేదా 18 తేదీల్లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారట.

సినిమాకు సంబంధించిన షూటింగ్ దాదాపుగా పూర్తయ్యిందని, ప్రస్తుతం ఐటెమ్ సాంగ్ చిత్రీకరణ మాత్రమే జరుగుతోందని టాక్ వినిపిస్తోంది. అది కూడా లాస్ట్ లో ఉందట. అదే సమయంలో రిలీజ్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్‌ ను కూడా భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు. ట్రైలర్ విడుదల తర్వాత పాన్ ఇండియా రేంజ్ లో ప్రమోషన్లు స్పీడప్ చేసి సినిమాకు మరింత హైప్ తీసుకురావాలని టీమ్ భావిస్తోంది.

పెద్ది స్పోర్ట్స్ బ్యాక్‌ డ్రాప్‌ లో రూపొందుతున్న యాక్షన్ డ్రామాగా ఉండబోతోంది. ఇందులో బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ ఫిమేల్ లీడ్ రోల్ లో నటిస్తుండగా, శివ రాజ్‌కుమార్, బొమన్ ఇరానీ, జగపతి బాబు వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఆ స్టార్ క్యాస్టింగ్ సినిమాపై ఇప్పటికే ఉన్న అంచనాలను మరింత పెంచుతోంది. సినిమాకు సంగీతం అందిస్తున్నది ఆస్కార్ విజేత ఏ.ఆర్ రెహమాన్ కావడం మరో ప్రత్యేక ఆకర్షణ.

ఇప్పటికే విడుదలైన కొన్ని పాటలు, చరణ్ లుక్ పోస్టర్లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. రెహమాన్ మ్యూజిక్ సినిమాకు ప్రధాన బలం అవుతుందని మెగా ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు. ఇక ట్రైలర్ విషయానికి వస్తే, ఏ సినిమా విజయానికైనా అది కీలక పాత్ర పోషిస్తుంది. సరైన కట్, ఎమోషన్, మాస్ ఎలిమెంట్స్ కలిపి ట్రైలర్‌ ను రూపొందిస్తే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడతాయి.

అదే ఓపెనింగ్స్‌ పై నేరుగా ప్రభావం చూపుతుంది. అందుకే పెద్ది ట్రైలర్‌ ను మేకర్స్ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ప్రస్తుతం టాలీవుడ్‌ లో భారీ ఓపెనింగ్స్‌ కు ట్రైలర్ ఎంత కీలకమో గత సినిమాలు నిరూపించాయి. అదే ట్రెండ్‌ ను కొనసాగిస్తూ పెద్ది మూవీ ట్రైలర్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటే, బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టించే అవకాశం ఉందని అంతా చెబుతున్నారు.

ఇక రిలీజ్ ప్లానింగ్ కూడా గ్రాండ్‌ గా జరుగుతోంది. ఐదు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా సినిమాను విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. వృద్ధి సినిమాస్ నిర్మిస్తున్న ఆ ప్రాజెక్ట్‌ ను పాన్ ఇండియా లెవెల్ లో భారీగా రిలీజ్ చేయాలన్నదే మేకర్స్ లక్ష్యం. మొత్తానికి, మంచి కంటెంట్‌ తో పాటు స్ట్రాంగ్ ట్రైలర్ కట్ పడితే పెద్ది సినిమా ఓపెనింగ్స్‌ తోనే సంచలనం సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు అందరి చూపు మే 17/18న రానున్న ట్రైలర్‌ పైనే ఉంది. అది ఎలా ఉంటుందో బట్టి సినిమా రేంజ్ మరింత క్లియర్ అవుతుంది. మరేం జరుగుతుందో అంతా వేచి చూడాలి.