Begin typing your search above and press return to search.

గ్లోబ‌ల్ స్టార్ కి `పెద్ది` టైటిల్ స‌రితూగుతుందా?

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ రేంజ్ ఇప్పుడు గ్లోబ‌ల్ స్థాయిని తాకింది. `ఆర్ ఆర్ ఆర్` చిత్రం త‌ర్వాత అత‌డి రేంజ్ పాన్ ఇండియా కాదు పాన్ వ‌ర‌ల్డ్.

By:  Tupaki Desk   |   7 Jun 2025 2:09 PM
గ్లోబ‌ల్ స్టార్ కి `పెద్ది` టైటిల్ స‌రితూగుతుందా?
X

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ రేంజ్ ఇప్పుడు గ్లోబ‌ల్ స్థాయిని తాకింది. `ఆర్ ఆర్ ఆర్` చిత్రం త‌ర్వాత అత‌డి రేంజ్ పాన్ ఇండియా కాదు పాన్ వ‌ర‌ల్డ్. `ఆర్ ఆర్ ఆర్` కి వ‌ర‌ల్డ్ వైడ్ గా ద‌క్కిన గుర్తింపు ఎంతో గొప్ప‌ది. ఆస్కార్ అవార్డు సైతం అందుకుంది. హాలీవుడ్ లెజెండ‌రీ డైరెక్ట‌ర్ల ప్ర‌శంస‌లు అందుకుంది. ఇదంతా ప‌క్క‌న బెడితే చ‌ర‌ణ్ పెర్పార్మెన్స్ కి వ‌చ్చిన గుర్తింపు మ‌రింత ప్ర‌త్యేకం. ఆ సినిమా కోసం చ‌ర‌ణ్ ప‌డిన క‌ష్టం క‌నిపించింది. ఆ శ్రమే చ‌ర‌ణ్ కి గ్లోబ‌ల్ స్థాయిలో ఇమేజ్ తెచ్చి పెట్టింది.

హాలీవుడ్ లో అవకాశాల‌కు దారి తీసింది. ఈ విష‌యంలో చ‌ర‌ణ్- తార‌క్ కంటే ఓ మెట్టు పైనే ఉన్నాడు. ఆ రేంజ్ స్టార్ ఇప్పుడు `పెద్ది` అనే టైటిల్ తో ఓ సినిమా చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. దీనికి `ఉప్పెన` ద‌ర్శ‌కు డు బుచ్చిబాబు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. సినిమాలో కంటెంట్ సంగ‌తి ప‌క్క‌న బెడితే? `పెద్ది` టైటిల్ చ‌ర‌ణ్ గ్లోబ‌ల్ ఇమేజ్ కి స‌రితూగుతుందా? అన్న‌ది పెద్ద ప్ర‌శ్న‌.

`పెద్ది` అనేది ప‌క్కా తెలుగు టైటిల్. కుటుంబానికి, ఊరుకి నాయకుడైన వ్యక్తిగా పిల‌వొచ్చు. అన్నిం టిలోనూ ఆరితేరిన వ్య‌క్తి కావొచ్చు. తెలివైన‌, బ‌ల‌మైన వ్య‌క్తి కావొచ్చు. స‌మాజంలో అత‌డి పాత్ర ఎంతో ప్ర‌త్యేక‌మైనది కావొచ్చు. ఇలా `పెద్ది` టైటిల్ కి చాలా అంశాలు సరితూగుతాయి. కానీ ఈ చిత్రాన్ని పాన్ ఇండియాలో రిలీజ్ చేస్తున్నారు. ఓవ‌ర్సీస్ రిలీజ్ ఎలాగూ ఉంటుంది. అటుపై టాక్ ని బ‌ట్టి వివిధ ప్ర‌త్యేక‌ దేశాల్లో కూడా రిలీజ్ అయ్యే అవ‌కాశం ఉంటుంది.

మ‌రి `పెద్ది` అనే టైటిల్ క్యాచీగా ఉందా? పాన్ ఇండియాకి ....చ‌ర‌ణ్ గ్లోబ‌ల్ ఇమేజ్ కి సెట్ అవుతుందా? అంటే ఎంత మాత్రం సెట్ అవ్వ‌ద‌ని నిస్సందేహంగా చెప్పొచ్చు. గ్లోబ‌ల్ రేంజ్ ఉన్న హీరో టైటిల్ అంటే? టైటిల్ స్కార్క్ గా ఉండాలనే అంశం తెర‌పైకి వ‌స్తోంది. ఎంతో ప్రోపెష‌న‌ల్ గా ఉండాలంటున్నారు.`పెద్ది` లో అదెక్కడా క‌నిపించ‌లేదు. ఈటైటిల్ రీజ‌నల్ మార్కెట్ ని బేస్ చేసుకుని నిర్ణ‌యించిన‌ట్లే ఉంద‌నే విమ‌ర్శ వ్య‌క్త‌మ‌వుతోంది.