Begin typing your search above and press return to search.

పెద్ది: ఇలాంటి షాట్స్.. అంతకుమించి!

సినిమాలో స్పోర్ట్స్ డ్రామా కంటెంట్‌కు తగ్గట్టుగా క్రికెట్ సన్నివేశాలు అద్భుతంగా ఉండేలా బుచ్చి బాబు ప్లాన్ చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   18 Jun 2025 12:18 PM IST
పెద్ది: ఇలాంటి షాట్స్.. అంతకుమించి!
X

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న భారీ పాన్ ఇండియా స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ పై రోజుకో అప్డేట్ తో హైప్ పెరుగుతోంది. బుచ్చి బాబు సనా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా మొదటి గ్లింప్స్‌తోనే సాలీడ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ప్రత్యేకంగా రామ్ చరణ్‌ క్రికెట్ షాట్‌కి అభిమానుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. అయితే లేటెస్ట్ గా చిత్రబృందం నుంచి వచ్చిన అప్‌డేట్ ప్రకారం ఆ షాట్‌ కేవలం సాంపుల్ మాత్రమే, అంతకంటే బెటర్ సన్నివేశాలు వస్తున్నాయని చెప్పేసింది.

‘పెద్ది’ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. కొరియోగ్రాఫర్ క్రికెట్ షాట్ ను కంపోజ్ చేస్తున్న విధానం హైకేజీ అయ్యింది. ఇక సినిమా కోసం స్పెషల్ కోర్ క్రికెట్ షాట్స్ కోసమే నలుగురు కొరియోగ్రాఫర్లు పనిచేస్తున్నారని టీమ్ వెల్లడించింది. ఈ షాట్స్‌ను కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా.. మాస్ ఫ్లోలో, స్టైల్లో డిజైన్ చేయడం విశేషం.

సినిమాలో స్పోర్ట్స్ డ్రామా కంటెంట్‌కు తగ్గట్టుగా క్రికెట్ సన్నివేశాలు అద్భుతంగా ఉండేలా బుచ్చి బాబు ప్లాన్ చేస్తున్నారు. ప్రతీ ఒక్క షాట్‌కు పర్ఫెక్షన్ కోసం ప్రత్యేక కసరత్తులు జరుగుతున్నాయి. ఒక ఊర మాస్ క్రికెటర్ ఎలా ప్రాక్టీస్ చేస్తారో చూపించిన విధంగా ఈ సినిమా కూడా రియలిస్టిక్‌గా చూపించబోతోంది. ఇందుకోసం చరణ్ కూడా ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నాడు.

ఇప్పటికే ‘పెద్ది’ సెట్‌లో రామ్ చరణ్ ప్రిపరేషన్ చూసిన వారంతా ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఫిట్‌నెస్, బాడీ లాంగ్వేజ్, షాట్ ఎగ్జిక్యూషన్ అన్నిటిలోనూ 100% ఎనర్జీ చూపిస్తున్నారని ఇంటర్నల్ టాక్. మరోవైపు ఈ క్రికెట్ షాట్స్‌కు సంబంధించి చిత్రబృందం రిలీజ్ చేయబోయే కొత్త గ్లింప్స్‌కు పెద్ద ఎత్తున ఆంటిసిపేషన్ ఏర్పడుతోంది.

రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న ఈ సినిమాను వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. పవర్‌ఫుల్ విలన్‌గా దివ్యేందు శర్మ నటిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. 2026 మార్చి 27న గ్రాండ్ రిలీజ్ కావాలనే టార్గెట్‌తో టెక్నికల్ టీమ్ పూర్తి ఫోకస్‌తో ఉంది.

ఈ షాట్స్ కేవలం స్పోర్ట్స్‌ను చూపించడమే కాదు.. భావోద్వేగాలను స్పష్టంగా వ్యక్తీకరించడంలో కీలక పాత్ర పోషించబోతున్నాయి. ఇక బుచ్చి బాబు సనా తన రెండో సినిమాతోనే రామ్ చరణ్ స్థాయిని మరింత ఎత్తుకు తీసుకెళ్లేలా, తనను మరింత మెచ్చుకునేలా టేకింగ్ చూపించబోతున్నాడని సినీ వర్గాల్లో టాక్. ఇక సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి హిస్టరీ క్రియేట్ చేస్తుందో చూడాలి.