బుచ్చిబాబు తో చరణ్ నైట్ జర్నీ ఇంట్రెస్టింగ్!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా బుచ్చిబాబు దర్శకత్వంలో భారీ అంచనాల మద్య 'పెద్ది' తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కొంత భాగం షూటింగ్ పూర్తయింది.
By: Tupaki Desk | 6 Jun 2025 11:28 AM ISTమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా బుచ్చిబాబు దర్శకత్వంలో భారీ అంచనాల మద్య ` పెద్ది` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కొంత భాగం షూటింగ్ పూర్తయింది. ఇందులో కీలక సన్నివే శాలు చిత్రీకరించారు. ప్రధానంగా రామ్ చరణ్ పై క్రీడా నేపథ్యం గల సన్నివేశాలను నైట్ షూట్ లో చిత్రీకరించారు. దాదాపు 20 రోజుల పాటు నిరవధికంగా రాత్రిపూట మాత్రమే షూటింగ్ జరిగింది.
పగలంతా ఎలాంటి షూటింగ్ లేకుండా రాత్రి మాత్రమే చిత్రీకరించారు. దీంతో ఆసన్నివేశాలకు ఎంతటి ప్రాధాన్యత ఉందన్నది అర్దమైంది. ఈ నేపథ్యంలో నైట్ సన్నివేశాల చిత్రీకరణ పూర్తయిందనుకున్నారంతా. కానీ తాజాగా మళ్లీ హైదరాబాద్ లో ప్రారంభమైన కొత్త షెడ్యూల్ రాత్రిపూట షూటింగ్ చేస్తున్నారు. అందుకోసం ప్రత్యేకంగా కొన్ని సెట్లు కూడా నిర్మించారు. ఈ షెడ్యూల్ లో కూడా రామ్ చరణ్ పై భారీ యాక్షన్ సన్ని వేశాలు చిత్రీకరిస్తున్నారు.
ఇదే షెడ్యూల్ లో మరికొన్ని క్రీడా నేపథ్యంగల సన్నివేశాలు చిత్రీకరించాల్సి ఉందట. వారం పది రోజుల పాటు ఈ సన్నివేశాల చిత్రీకరణ సాగుతుందని సమాచారం. దీంతో సినిమాలో నైట్ సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని తెలుస్తోంది. తొలి షెడ్యూల్ మొదలైంది. అక్కడ చరణ్, జాన్వీల పైపగటి పూట చిత్రీకరణ చేసారు. దీంతో చరణ్ కి హైదరాబాద్ షూటింగ్ అంతా కొత్తగా అనిపిస్తుందిట.
నటుడిగా ఈ సినిమా సరికొత్త అనుభూతిని పంచుతుంది అన్న ధీమాని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకూ చరణ్ చాలా సినిమాలు చేసారు. వాటిలో కొన్ని సినిమాల కోసం నైట్ షూట్ లో కూడా పాల్గొన్నారు. కానీ ఆ రోజుల్ని వేళ మీద లెక్కపెట్టొచ్చు. బుచ్చిబాబు ఏకంగా నైట్ మాత్రమే ప్లాన్ చేసి షూట్ చేయడంతో? కథలో నైట్ సన్నివేశాల ప్రాధాతన్యత అద్దం పడుతుంది.
