పెద్ది కోసం బుచ్చిబాబు నెక్ట్స్ లెవెల్ ప్లాన్.. ఒక్కో సాంగ్ కు మూడు రిఫరెన్సులు
ఆ సినిమాకు రెహమాన్ తన మార్క్ మ్యూజిక్ ఇవ్వడంలో విఫలమయ్యారు. దీంతో రెహమాన్ తమ హీరోతో చేస్తున్న పెద్ది సినిమాకు ఎలాంటి మ్యూజిక్ ఇస్తారోనని చరణ్ ఫ్యాన్స్ తెగ టెన్షన్ పడుతున్నారు.
By: Tupaki Desk | 5 July 2025 4:08 AMఇండస్ట్రీలో కొన్ని సినిమాల ఫలితాలు తర్వాత రాబోయే సినిమాలపై ప్రభావం చూపుతాయనే సంగతి తెలిసిందే. రీసెంట్ గా కమల్ హాసన్ హీరోగా మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన థగ్ లైఫ్ సినిమా ఎఫెక్ట్ రామ్ చరణ్ సినిమా పెద్ది విషయంలో కూడా ఉంది. దానికి కారణం ఈ రెండు సినిమాలకూ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ కావడం. థగ్ లైఫ్ సినిమా డిజాస్టర్ లో రెహమాన్ పాత్ర కూడా ఉంది.
ఆ సినిమాకు రెహమాన్ తన మార్క్ మ్యూజిక్ ఇవ్వడంలో విఫలమయ్యారు. దీంతో రెహమాన్ తమ హీరోతో చేస్తున్న పెద్ది సినిమాకు ఎలాంటి మ్యూజిక్ ఇస్తారోనని చరణ్ ఫ్యాన్స్ తెగ టెన్షన్ పడుతున్నారు. మణిరత్నం లాంటి తలలు పండిన డైరెక్టర్‌కే రెహమాన్ థగ్‌లైఫ్ లాంటి ఆల్బమ్ ఇస్తే, కేవలం ఉప్పెన అనుభవం మాత్రమే ఉన్న బుచ్చిబాబుకు ఎలాంటి మ్యూజిక్ ఇస్తారో అని కంగారు పడుతున్నారు.
అయితే బుచ్చిబాబును అంత తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఉప్పెన సినిమా చేస్తున్నప్పుడు దేవీ శ్రీ ప్రసాద్ నుంచి ఛార్ట్‌బస్టర్ ఆల్బమ్ ను తీసుకున్న బుచ్చిబాబు ఇప్పుడు పెద్దికి కూడా అలాంటి ప్లానే వేశారట. పెద్ది సినిమాలో సాంగ్స్ కోసం బుచ్చిబాబు, రెహమాన్ కు ఒక్కో సాంగ్ కు మూడు రిఫరెన్సులు ఇచ్చి వాటిని బేస్ చేసుకుని తన సినిమాకు ది బెస్ట్ ఇవ్వమని కోరారట.
అయితే బుచ్చిబాబు రిఫరెన్సులుగా ఇచ్చిన పాటల్లో ఎక్కువ శాతం ఒకప్పుడు రెహమాన్ ఇచ్చిన ఛార్ట్ బస్టర్ సాంగ్స్ ఉండటం విశేషం. ఇవన్నీ చూసి బుచ్చిబాబు కు మ్యూజిక్ పై ఎంత పట్టుందో తనకు అర్థమైందని రెహమాన్ తన డైరెక్టర్ గురించి రీసెంట్ గా ఓ సందర్భంలో ఎలివేషన్లు ఇస్తున్నారు. వాస్తవానికి థగ్ లైఫ్ సినిమాలో గొప్ప మ్యూజిక్ చేసేంత కథ కూడా లేదు. అయితే థగ్ లైఫ్ సినిమా డిజాస్టర్ తర్వాత ఉన్న అంచనాలను పెద్ది టీజర్ తోనే రెహమాన్ చాలా వరకు క్లియర్ చేశారు.
గేమ్ ఛేంజర్ తో డిజాస్టర్ అందుకున్న చరణ్ ఫ్యాన్స్ కు పెద్ది మూవీకి సంబంధించిన ప్రతీ విషయంలోనూ కంగారు ఉండటం సహజం. కానీ రెహమాన్ మాటలు వింటుంటే బుచ్చిబాబు పెద్ది విషయంలో తాను అనుకున్న అవుట్‌పుట్ వచ్చే వరకు ఎవరినీ అంత ఈజీగా వదిలేలా కనిపించడం లేదు. ప్రస్తుతం పెద్ది షూటింగ్ నిర్విరామంగా జరుగుతుంది. ఈ నెలలోనే సాంగ్స్ షూట్ కు వెళ్లనున్నట్టు తెలుస్తోంది. వచ్చే ఏడాది మార్చి 27న పెద్ది సినిమా రిలీజవనుండగా, ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు.