పెద్ది అప్డేట్... నైట్ జాయిన్ అయిన చరణ్
పెద్ది సినిమాను పీరియాడిక్ డ్రామాగా రూపొందిస్తున్నారు. అప్పటి పరిస్థితులను కళ్లకు కట్టినట్లుగా చూపించడం కోసం భారీగా ఖర్చు చేసి సెట్టింగ్ వేయిస్తున్నారు.
By: Tupaki Desk | 5 Jun 2025 1:36 PM ISTరామ్ చరణ్ ఈ ఏడాది ఆరంభంలో సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు గేమ్ ఛేంజర్ సినిమాతో వచ్చిన విషయం తెల్సిందే. గేమ్ ఛేంజర్ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశ పరచినా కూడా మెగా ఫ్యాన్స్ అంతా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా 'పెద్ది'. ఈ సినిమాను బుచ్చిబాబు తెరకెక్కిస్తున్నాడు. సుకుమార్ శిష్యుడు అయిన బుచ్చిబాబు మొదటి సినిమా ఉప్పెనతో సెన్షేషన్ క్రియేట్ చేశాడు. గురువుకు తగ్గ శిష్యుడు అనిపించుకున్న బుచ్చిబాబు ఉప్పెన సినిమా తో వంద కోట్లకు పైగా వసూళ్లను సాధించిన విషయం తెల్సిందే. ఉప్పెన సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న బుచ్చిబాబు ప్రస్తుతం పెద్ది సినిమాను భారీ అంచనాల నడుమ రూపొందిస్తున్నాడు.
'పెద్ది' సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన గ్లిమ్స్ అంచనాలు భారీగా పెంచాయి. సినిమా ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటీవల సినిమాను 2026 మార్చిలో విడుదల చేస్తామని అధికారికంగా ప్రకటించారు. సినిమా విడుదల తేదీకి ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ చేస్తున్నారు. మొన్నటి వరకు ఒక షెడ్యూల్ జరిగిన విషయం తెల్సిందే. ఆ షెడ్యూల్ పూర్తి చేసుకున్న మేకర్స్ వారం గ్యాప్ తో మరో భారీ షెడ్యూల్‌కి రెడీ అయ్యారు. ఈసారి నైట్ ఎఫెక్ట్‌లో షూటింగ్ జరుగుతుంది. గత నైట్ నుంచి రామ్ చరణ్ సైతం పెద్ది షూటింగ్‌లో జాయిన్ అయ్యాడని తెలుస్తోంది.
పెద్ది సినిమాను పీరియాడిక్ డ్రామాగా రూపొందిస్తున్నారు. అప్పటి పరిస్థితులను కళ్లకు కట్టినట్లుగా చూపించడం కోసం భారీగా ఖర్చు చేసి సెట్టింగ్ వేయిస్తున్నారు. ప్రతి ఒక్కటీ అప్పటి సాంస్కృతి సాంప్రదాయాలను చూపించే విధంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. రామ్ చరణ్ సూపర్ హిట్ మూవీ రంగస్థలంలో ఎలా అయితే రఫ్ లుక్‌లో, మాస్ లుక్‌లో కనిపించాడో అలాగే ఈ సినిమాలోనూ కనిపించబోతున్నాడు. పల్లెటూరుకు చెందిన క్రీడాకారుడిగా రామ్ చరణ్ కనిపించబోతున్నాడు. ఆ ఆట.. ఈ ఆట అని కాకుండా అన్ని ఆటలను రామ్ చరణ్ ఈ సినిమాలో ఆడుతాడని తెలుస్తోంది. రామ్ చరణ్ లుక్ ఆకట్టుకుంది.
ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెల్సిందే. మొదటి షెడ్యూల్‌లో కొన్ని రోజుల పాటు షూటింగ్‌లో పాల్గొన్న జాన్వీ కపూర్ తిరిగి ఈ షెడ్యూల్‌లో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. నైట్ షెడ్యూల్‌లో రామ్ చరణ్, జాన్వీ కపూర్‌లపై కీలక సన్నివేశాలు చిత్రీకరించబోతున్నారు. అంతే కాకుండా ఒక యాక్షన్ సన్నివేశాన్ని కూడా ఈ షెడ్యూల్‌లోనే చిత్రీకరిస్తారు అని తెలుస్తోంది. సినిమాలోని పాటలను అతి త్వరలోనే షూట్ చేయబోతున్నారు. ఇప్పటికే రెండు మూడు పాటలు ట్యూన్ చేశారని, త్వరలోనే ఆ పాటల చిత్రీకరణ కూడా ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం అందుతోంది. సినిమాను వచ్చే సమ్మర్‌లో సినిమా విడుదల చేయడం కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి.
