పెద్ది షూటింగ్ లేటెస్ట్ అప్డేట్
పెద్ది గ్లింప్స్ కు మెగా ఫ్యాన్సే కాకుండా యాంటీ ఫ్యాన్స్ కూడా ఇంప్రెస్ అయ్యారు. ఇక అసలు విషయానికొస్తే ఈ సినిమా ప్రస్తుతం షెడ్యూల్ బ్రేక్ లో ఉంది.
By: Tupaki Desk | 15 May 2025 12:55 PMగ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా పెద్ది. ఉప్పెన తర్వాత బుచ్చిబాబు ఎంతో కాలం వెయిట్ చేసి మరీ ఈ సినిమా తీస్తున్నాడు. వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో మొదలవాల్సింది కానీ గేమ్ ఛేంజర్ ఆలస్యం అవడంతో ఆ ఎఫెక్ట్ పెద్ది సినిమాపై కూడా పడిందన్నది అందరికీ తెలుసు.
ఈ సినిమా చాలా అద్భుతంగా ఉంటుందని పెద్దిని బుచ్చిబాబు నెక్ట్స్ లెవెల్ లో తెరకెక్కిస్తున్నాడని ఇప్పటికే చాలా మంది చెప్పారు. బుచ్చిబాబు గురువు డైరెక్టర్ సుకుమార్ తాను పెద్ది స్క్రిప్ట్ విన్నప్పుడు షాకయ్యానని చెప్పగా, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ పెద్ది సినిమా కోసం తానెంతో వెయిట్ చేస్తున్నానని అన్నారు.
ఇక ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఏఆర్ రెహమాన్ అయితే పెద్ది కథ తనకెంతో నచ్చిందని, ఆ సినిమాకు మ్యూజిక్ చేయడం తన అదృష్టమనే రేంజ్ లో చెప్పారు. ఇవన్నీ చూస్తుంటే నిజంగానే బుచ్చిబాబు పెద్ది కోసం చాలా పెద్ద ప్లానే వేశాడని అర్థమవుతుంది. దీంతో పెద్దపై అందరికీ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు తగ్గట్టే పెద్ది నుంచి ఫస్ట్ గ్లింప్స్ రిలీజైంది.
పెద్ది గ్లింప్స్ కు మెగా ఫ్యాన్సే కాకుండా యాంటీ ఫ్యాన్స్ కూడా ఇంప్రెస్ అయ్యారు. ఇక అసలు విషయానికొస్తే ఈ సినిమా ప్రస్తుతం షెడ్యూల్ బ్రేక్ లో ఉంది. రామ్ చరణ్ లండన్ టూర్ కు వెళ్లడం వల్ల నెక్ట్స్ షెడ్యూల్ ను దానికి అనుగుణంగా ప్లాన్ చేశారు. అందులో భాగంగానే పెద్ది తర్వాతి షెడ్యూల్ మే 16 నుంచి జరుగుతుందని తెలుస్తోంది.
కర్ణాటక లో మొదలుకానున్న పెద్ది కొత్త షెడ్యూల్ షూటింగ్ లో హీరో రామ్ చరణ్ తో పాటూ హీరోయిన్ జాన్వీ కపూర్ మరియు ప్రధాన తారాగణమంతా పాల్గొననున్నట్టు సమాచారం. 10 రోజుల పాటూ ఈ షెడ్యూల్ జరగనున్నట్టు తెలుస్తోంది. చరణ్ కెరీర్లో 16వ సినిమాగా తెరకెక్కుతున్న పెద్ది సినిమాను వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.