Begin typing your search above and press return to search.

రైమ్ తో చరణ్.. లుక్కు అదిరిందిగా..!

చరణ్ మేడమ్ టుస్సాడ్స్ స్టాట్యూ లో అతను మాత్రమే కాదు అతని పెట్ రైం ని కూడా ఉంచారు.

By:  Tupaki Desk   |   13 May 2025 5:01 PM
రైమ్ తో చరణ్.. లుక్కు అదిరిందిగా..!
X

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ RRR తో ఇంటర్నేషనల్ లెవెల్ క్రేజ్ తెచ్చుకున్నాడు. ఆ సినిమాలో రామరాజు పాత్రలో ఆయన అభినయం ఫ్యాన్స్ కే కాదు సినీ అభిమానులను ఇంప్రెస్ చేసింది. కేవలం 15 సినిమాలతోనే చరణ్ చేసిన సినిమాలు అవి సాధిస్తున్న రికార్డులు ఫ్యాన్స్ ని మెప్పిస్తున్నాయి. ఇక ఈ క్రమంలో ప్రఖ్యాత మేడం టుస్సాడ్స్ మైనపు బొమ్మని కూడా లాంచ్ చేశాడు చరణ్. ఈమధ్యనే తన స్టాట్యూ ఓపెనింగ్ ఈవెంట్ కి చరణ్ తన ఫ్యామిలీతో కలిసి పాల్గొన్నాడు.

చరణ్ మేడమ్ టుస్సాడ్స్ స్టాట్యూ లో అతను మాత్రమే కాదు అతని పెట్ రైం ని కూడా ఉంచారు. చరణ్ కి బాగా ఇష్టమైన రైమ్ లేకపోతే స్టాట్యూ వెలితిగా ఉంటుందని అనుకున్నారో ఏమో తన కొలతలతో వచ్చినప్పుడు ఆ రైమ్ వి కూడా తీసుకుని ఎగ్జాక్ట్ గా దాన్ని కూడా డిటో దించేశారు. మేడం టుస్సాడ్స్ లో స్టాట్యూ ఈవెంట్ ముగియగానే ఫ్యాన్స్ మీట్ ఏర్పాటు చేసుకున్నాడు చరణ్.

ఇక ఈ టైం లోనే అలా యూకే వీధుల్లో సరదాగా తిరిగాడు. మన దగ్గర కాస్త ప్రవైసీ కష్టం కానీ అక్కడ చరణ్ తిరిగితే అది కూడా కాస్త పబ్లిక్ ఎక్కువ లేని ఏరియాల్లో పర్వాలేదని చెప్పొచ్చు. అలానే అలా రైమ్ తో వాకింగ్ చేస్తూ సూటు బూటు వేసుకున్న చరణ్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది సడెన్ గా చూసి ఇది కూడా మేడం టుస్సాడ్స్ స్టాట్యూనా అనుకునేలా ఉంది ఆ స్టిల్.

త్వరలో పెద్దిగా రాబోతున్న చరణ్ ఆ సినిమా గురించి కూడా ఫ్యాన్స్ ని ఎప్పటికప్పుడు ఎంగేజ్ చేస్తూనే ఉన్నాడు. పెద్ది ఫస్ట్ షాట్ తో సూపర్ సాటిస్ఫైడ్ గా ఉన్న ఫ్యాన్స్ కి సినిమాతో కావాల్సినంత మాస్ స్టఫ్ ఇస్తానని ప్రామిస్ చేశాడు. బుచ్చి బాబు సన డైరెక్షన్ లో తెరకెక్కుతున్న పెద్ది సినిమా 2026 మార్చి 27న రిలీజ్ ఫిక్స్ చేశారు. ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. పెద్ది లో రామ్ చరణ్ మాస్ లుక్ ఫ్యాన్స్ కి బాగా ఎక్కేసింది. అంతేకాదు ఫస్ట్ సాట్ అంటూ క్రికెట్ బ్యాట్ ని అలా రెండు స్టెప్పులతో లాగి కొట్టడం అయితే నెక్స్ట్ లెవెల్ అనేస్తున్నారు ఫ్యాన్స్.