Begin typing your search above and press return to search.

పెద్ది.. ఆ డేట్ వెనుక ఎన్నో ఆలోచనలు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబినేషన్లో వస్తున్న ‘పెద్ది’ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్న విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   24 April 2026 4:28 PM IST
పెద్ది.. ఆ డేట్ వెనుక ఎన్నో ఆలోచనలు
X

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబినేషన్లో వస్తున్న ‘పెద్ది’ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుండి రిలీజ్ డేట్ విషయంలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మొదట జూన్ 4న సినిమా వస్తుందని ప్రచారం జరిగినా, లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం మేకర్స్ మరో డేట్‌ను ఖరారు చేశారు. కేవలం సెంటిమెంట్ కోసం కాకుండా, పక్కా బిజినెస్ లెక్కలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ డేట్ మార్పు వెనుక ఉన్న అసలు కారణాలు ఇప్పుడు ఫిల్మ్ నగర్ లో ఆసక్తికరంగా మారాయి. అసలు విషయం ఏంటంటే, ‘పెద్ది’ సినిమాను జూన్ 25న విడుదల చేయడానికి చిత్ర బృందం మొగ్గు చూపుతోంది. జూన్ మొదటి వారంలో స్కూళ్లు రీఓపెన్ అయ్యే హడావిడి ఉండటంతో ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు రావడం కష్టమని భావించి జూన్ 4 ఆప్షన్‌ను పక్కన పెట్టారు. అదే 25వ తేదీ అయితే నెలాఖరు కావడంతో పాటు శాలరీలు పడే టైమ్, దీనివల్ల ఓపెనింగ్స్‌కు ప్లస్ అవుతుంది.

అంతేకాకుండా యూఎస్ మార్కెట్‌లో జూలై వీకెండ్ అడ్వాంటేజ్ కూడా ఈ సినిమాకు కలిసి వస్తుంది. ఓవర్సీస్ వసూళ్లపై కన్నేసిన చరణ్ టీమ్, ఈ లాంగ్ రన్ స్ట్రాటజీతోనే జూన్ 25ను లాక్ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే 90 శాతం చిత్రీకరణ పూర్తవ్వగా, మే మొదటి వారంలో శ్రుతి హాసన్‌తో ఒక స్పెషల్ ఐటెం సాంగ్ షూట్ చేయబోతున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండటం మరో విశేషం.

రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ కథ బి, సి సెంటర్ల ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుందని మేకర్స్ నమ్ముతున్నారు. ల్ అందుకే ప్రమోషన్లకు కూడా తగినంత సమయం దొరికేలా జూన్ నెలాఖరును ఎంచుకున్నారు. వృద్ధి సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా ఈ భారీ ప్రాజెక్టును నిర్మిస్తున్నాయి. రామ్ చరణ్‌కు ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత గ్లోబల్ మార్కెట్ పెరిగినప్పటికీ, సోలో హీరోగా తన బాక్సాఫీస్ స్టామినాను నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. బుచ్చిబాబు తన మార్క్ సెన్సిబిలిటీస్‌తో ఈ కథను చాలా ఇంటెన్సివ్ గా తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది.

రెహమాన్ ఇచ్చే మ్యూజిక్, సినిమాలో ఉండే ఎమోషనల్ సీన్లు ఆడియన్స్‌కు కొత్త అనుభూతిని ఇస్తాయని టాక్. డిస్ట్రిబ్యూటర్లకు కూడా జూన్ 25 సేఫ్ డేట్ అని అనిపించడంతో, అందరూ ఈ డేట్‌కే ఓటు వేశారు. త్వరలోనే దీనిపై ఒక అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి ‘పెద్ది’ రిలీజ్ విషయంలో మేకర్స్ చాలా తెలివిగా అడుగులు వేస్తున్నారు. కేవలం హడావిడిగా సినిమాను థియేటర్లలోకి తీసుకురాకుండా, వసూళ్లు వచ్చే అవకాశం ఉన్న సమయాన్ని ఎంచుకున్నారు. షూటింగ్ పూర్తి చేసుకుని ప్యాచ్ వర్క్ కూడా ఫినిష్ చేస్తే, జూన్ లో చరణ్ మాస్ హడావుడి మొదలవ్వడం ఖాయం.