Begin typing your search above and press return to search.

పెద్ది : మెల్లగా ఎక్కిస్తున్న బుచ్చిబాబు..!

దర్శకుడు బుచ్చిబాబు సినిమా విడుదలకు ఏడాది ఉండగానే మెల్ల మెల్లగా జనాల్లోకి తీసుకు వెళ్లాలి అనే ఉద్దేశంతో ప్రమోషనల్‌ స్టఫ్‌ ని రెడీ చేసుకుంటున్నాడు.

By:  Tupaki Desk   |   22 July 2025 12:59 PM IST
పెద్ది : మెల్లగా ఎక్కిస్తున్న బుచ్చిబాబు..!
X

రామ్‌ చరణ్‌ 'గేమ్‌ ఛేంజర్‌' వంటి సూపర్ ఫ్లాప్‌ తర్వాత చేస్తున్న సినిమా కావడంతో 'పెద్ది' సినిమా విషయంలో అనుమానాలు ఉండాలి. కానీ బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తుండటంతో పాటు, రామ్‌ చరణ్‌ లుక్‌ మరో చిట్టి బాబు పాత్రను పోలి ఉండటం వంటి కారణాల వల్ల పెద్ది సినిమాపై అంచనాలు మెల్లమెల్లగా పెరుగుతూ వస్తున్నాయి. ఆ మధ్య పెద్ది నుంచి వచ్చిన ఫస్ట్‌ షాట్‌/గ్లిమ్స్‌ సినిమాపై అంచనాలను పెంచేసింది. దర్శకుడు బుచ్చిబాబు సినిమా విడుదలకు ఏడాది ఉండగానే మెల్ల మెల్లగా జనాల్లోకి తీసుకు వెళ్లాలి అనే ఉద్దేశంతో ప్రమోషనల్‌ స్టఫ్‌ ని రెడీ చేసుకుంటున్నాడు. ఫస్ట్‌ షాట్‌ అనేది సినిమా గురించి జనాల్లో చర్చ జరిగేలా చేస్తుందని మేకర్స్‌ భావించి ఉంటారు.

పెద్ది ఫస్ట్‌ షాట్‌ మొత్తం మార్చేసింది. అంతకు ముందు వచ్చిన గేమ్‌ ఛేంజర్‌ మూవీని మొత్తం మరచి పోయారు. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా తర్వాత రామ్‌ చరణ్ మళ్లీ ఆ స్థాయి విజయాన్ని సొంతం చేసుకోబోతున్నాడు. బాక్సాఫీస్‌ షేక్‌ చేసే విధంగా పెద్ది ఉంటుంది అనిపించేంతగా ఫస్ట్‌ షాట్‌ సక్సెస్ అయింది. రామ్‌ చరణ్‌ కొట్టిన ఆ ఫస్ట్‌ షాట్‌ ఖచ్చితంగా సెంచరీకి దారి తీస్తుందని, విజయానికి మెట్లు వేస్తుందనే విశ్వాసం వ్యక్తం అవుతుంది. ఆ షాట్‌ కి వచ్చిన రెస్పాన్స్‌ నేపథ్యంలో దర్శకుడు బుచ్చిబాబు మరింత జాగ్రత్త పడే అవకాశాలు ఉన్నాయి. అందులో భాగంగానే సినిమా మేకింగ్‌లో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటాడని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సినిమాను ఎప్పుడూ వార్తల్లో ఉండేలా దర్శకుడు ప్రయత్నాలు చేస్తున్నాడు. అప్పుడప్పుడు ఏదైనా స్టిల్‌ కారణంగా, మరేదైనా పోస్టర్‌ కారణంగా వార్తల్లో ఉండాలని బుచ్చిబాబు ప్రయత్నాలు చేస్తున్నాడు. సినిమాను రూపొందించడం ఒక ఎత్తు అయితే ఆ సినిమాను జనాల్లోకి తీసుకు వెళ్లడం ఒక ఎత్తు అవుతుంది. పెద్ది సినిమాను జనాల్లోకి ఎక్కించేందుకు బుచ్చిబాబు ఎంచుకున్న ప్రమోషన్‌ రూట్‌ బాగుందని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే దర్శకుడు బుచ్చిబాబు సినిమాలోని హీరో పాత్రను రివీల్‌ చేశాడు. అధికారికంగా విడుదల చేసిన ప్రమోషనల్‌ స్టఫ్‌ అయితే ఏంటి, కొన్ని వచ్చిన లీక్‌లు అయితే ఏంటి మొత్తానికి సినిమాపై అంచనాలు పెంచేశాయి.

ఇప్పటికీ సినిమా గురించి జనాల్లో చర్చ జరగాలని నెలకు ఒకటి చొప్పున ఫ్యాన్స్‌కి హై మూమెంట్స్ ఇస్తూ వస్తున్నాడు. సినిమాను మెల్ల మెల్లగా జనాల్లోకి ఎక్కించేందుకు బుచ్చిబాబు చేస్తున్న ప్రయత్నాలు విజయాన్ని సొంతం చేసుకుంటున్నాయి. తప్పకుండా బుచ్చిబాబు 'పెద్ది' సినిమా తో ఒక మంచి కథ చెప్పబోతున్నాడు, తప్పకుండా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుంది అనే విశ్వాసం ప్రతి ఒక్కరిలోనూ కనిపిస్తుంది. పెద్ది సినిమాలో జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తూ ఉండగా, ఏఆర్‌ రెహమాన్ అందించబోతున్న సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచే అవకాశాలు ఉన్నాయి. వచ్చే ఏడాది మార్చి చివరి వారంలో విడుదల కాబోతున్న ఈ సినిమాలో కన్నడ సూపర్‌ స్టార్‌ శివ రాజ్‌ కుమార్‌తో పాటు, విజయ్‌ సేతుపతి కీలక పాత్రలో కనిపించబోతున్నాడనే వార్తలు వస్తున్నాయి.