చరణ్ `పెద్ది` స్టోరీలో ఇన్ని సర్‌ప్రైజ్‌లా?
ఉత్తరాంధ్ర యాసలో రామ్ చరణ్ చెప్పిన డైలాగ్‌లు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక గ్లింప్స్ చివర్లో చరణ్ క్రికెట్ ఆడుతూ వైరైటీ స్టైల్లో సిక్స్ షాట్ కొట్టడం ప్రధాన హైలైట్‌గా నిలిచింది.
By: Tupaki Desk | 10 April 2025 10:00 PM ISTగ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న క్రేజీ పాన్ ఇండియా మూవీ `పెద్ది`. లెక్కల మాస్టారు సుకుమార్ ప్రియ శిష్యుడు బుచ్చిబాబు సాన అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. సుకుమార్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. మార్చి 27న రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీ టైటిల్‌ని అనౌన్స్ చేసిన ప్రొడ్యూసర్స్ రీసెంట్‌గా ఫస్ట్ షాట్ పేరుతో గ్లింప్స్‌ని విడుదల చేశారు. బారు గడ్డం, చెవులకు, ముక్కుకు పోగులతో చరణ్ ఊరమాస్ లుక్‌లో కనిపించిన తీరు ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించింది.
ఉత్తరాంధ్ర యాసలో రామ్ చరణ్ చెప్పిన డైలాగ్‌లు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక గ్లింప్స్ చివర్లో చరణ్ క్రికెట్ ఆడుతూ వైరైటీ స్టైల్లో సిక్స్ షాట్ కొట్టడం ప్రధాన హైలైట్‌గా నిలిచింది. చరణ్ ఫస్ట్ గ్లింప్స్‌తోనే చర్చకు తెరతీయడంతో గ్లింప్స్ రిలీజైన 24 గంటల్లోనే రికార్డు స్థాయిలో 36.5 మిలియన్‌ల వ్యూస్‌ని క్రాస్ చేసి సరికొత్త రికార్డుని సృష్టించింది. నిన్నటి వరకు బుచ్చిబాబుపై సందేహంగా ఉన్న మెగా అభిమానులు ఒక్కసారిగా గ్లింప్స్‌లో చరణ్‌ని చూసి ఇది పక్కా బ్లాక్ బస్టర్ అని ఫుల్ క్లారిటీకి వచ్చేశారు.
గ్లింప్స్ ఎండింగ్‌లో క్రికెట్ గేమ్‌ని చూపించడంతో ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతున్నారు. అయితే ఇందులో క్రికెట్ మాత్రమే ప్రధానం కాదని, ఇందులో మరో సర్‌ప్రైజ్ కూడా ఉందని తెలుస్తోంది. ఈ మూవీ క్రికెట్‌తో పాటు రెజ్లింగ్ నేపథ్యంలో ప్రధానంగా సాగుతుందని, ఇవి రెండు సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయని తెలుస్తోంది. ఈ గేమ్‌లలో ఇంత వరకు చూడని మేనరిజమ్స్‌తో. విభిన్నమైన బాడీ లాంగ్వేజ్‌తో చరణ్ కనిపించి అదరహో అనిపించనున్నాడని ఇన్ సైడ్ టాక్.
అంతే కాకుండా క్రికెట్, కుస్తీ ఎపిసోడ్స్‌తో పాటు చరణ్‌పై షూట్ చేసిన ఫైట్స్ మాస్ ఆడియన్స్‌కి ఐఫీస్ట్‌గా ఉంటాయట. ఇప్పటి వరకు ఈ మూవీ షూటింగ్ ముప్పై శాతం పూర్తయింది. క్రికెట్ మ్యాచ్‌కు ఎమోషన్‌ను జోడించి చరణ్‌పై చిత్రీకరించే సన్నివేశాలు, చరణ్ హీరోయిజమ్ హైలైట్‌గా నిలుస్తాయట. ఇందులో జగపతిబాబుతో పాటు `మీర్జాపూర్` ఫేమ్ మున్నా అలియాస్ దివ్వేందు శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో చరణ్‌పై వచ్చే సన్నివేశాలు కూడా ఓ రేంజ్‌లో ఉంటాయట.
క్రికెట్‌తో పాటు ఈ మూవీలో వచ్చే కుస్తీ ఆడియన్స్ ని సర్‌ప్రైజ్ చేస్తందని ఇన్ సైడ్ టాక్. ఇప్పటికే ఈ మూవీ ఓటీటీ హక్కుల్ని ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫిక్స్ భారీ మొత్తానికి దక్కించుకుందని తెలిసింది. గ్లింప్స్‌కి భారీ క్రేజ్ ఏర్పడటంతో ఏరియావైజ్ బిజినెస్‌ని మేకర్స్ ఇంకా హోల్డ్‌లో పెట్టారట. సినిమా పూర్తయిన తరువాతే ఏరియాల వారిగా అప్పుడున్న క్రేజ్‌ని బట్టి బిజినెస్ క్లోజ్ చేయాలనే ప్లాన్‌లో ఉన్నారని టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది. ఇందుఏలో చరణ్‌కు జోడీగా జాన్వీ కపూర్ నటిస్తున్న విషయం తెలిసిందే.
