Begin typing your search above and press return to search.

పెద్ది హైప్ ఎక్కిస్తున్న గ్లోబల్ స్టార్..!

యూకే లో ఫ్యాన్స్ మీట్ లో పాల్గొన్న చరణ్ అందులో భాగంగానే పెద్ది గురించి చెప్పారు. తను నటించిన విలేజ్ బ్యాక్ డ్రాప్ సినిమాల్లో రంగస్థలం ది బెస్ట్ అని అంటుంటారు.

By:  Tupaki Desk   |   13 May 2025 2:29 PM
పెద్ది హైప్ ఎక్కిస్తున్న గ్లోబల్ స్టార్..!
X

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బుచ్చి బాబు సన కాంబినేషన్ లో వస్తున్న సినిమా పెద్ది. ఈ సినిమాలో చరణ్ మాస్ రోల్ లో కనిపించనున్నారు. ఈమధ్యనే పెద్ది నుంచి రిలీజైన ఫస్ట్ షాట్ సినిమాపై అంచనాలు పెంచేసింది. పెద్ది సినిమా ప్రతి అప్డేట్ ఫ్యాన్స్ కి ఫుల్ ట్రీట్ అందిస్తుంది. మెగా ఫ్యాన్స్ కి మస్త్ జబర్దస్త్ ఫెస్టివల్ ట్రీట్ ఇచ్చేలా ఈ సినిమా రాబోతుందని ఫిక్స్ అయ్యారు. సినిమా ఫస్ట్ షాటే నెక్స్ట్ లెవెల్ అనిపించింది.

ఐతే పెద్ది మీద ఇప్పటికే ఒక రేంజ్ ఎక్స్ పెక్టేషన్స్ ఉండగా వాటిని మరింత పెంచేస్తున్నాడు హీరో రామ్ చరణ్. తను చేస్తున్న సినిమా గురించి ఏ హీరో అంత ఎక్కువగా అంచనాలు పెంచరు. కానీ చరణ్ మాత్రం పెద్ది గురించి ఫ్యాన్స్ కి అదిరిపోయే న్యూస్ చెప్పాడు. పెద్ది సినిమా ఇప్పటికే 30 శాతం పూర్తైందని సినిమా అనుకున్న దాని కన్నా బాగా వస్తుందని అన్నారు. అంతేకాదు రంగస్థలం సినిమాను మించి పెద్ది ఉంటుందని అన్నారు చరణ్.

యూకే లో ఫ్యాన్స్ మీట్ లో పాల్గొన్న చరణ్ అందులో భాగంగానే పెద్ది గురించి చెప్పారు. తను నటించిన విలేజ్ బ్యాక్ డ్రాప్ సినిమాల్లో రంగస్థలం ది బెస్ట్ అని అంటుంటారు. ఐతే పెద్ది దాన్ని మించి ఉంటుందని అన్నారు చరణ్. సినిమా తప్పకుండా అందరినీ అలరిస్తుందని చెప్పుకొచ్చారు. పెద్ది సినిమా ఫస్ట్ షాట్ చూశాకే ఫ్యాన్స్ మాత్రమే కాదు ఆడియన్స్ కూడా సినిమా ఒక రేంజ్ లో ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందని ఫిక్స్ అయ్యారు.

బుచ్చి బాబు డైరెక్ట్ చేస్తున్న పెద్ది సినిమాలో చరణ్ సరసన జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. అంతేకాదు సినిమాకు ఏ.ఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. పెద్ది సినిమాను 2026 మార్చి 27న రిలీజ్ లాక్ చేశారు. ఉప్పెనతో ఫస్ట్ సినిమానే బ్లాక్ బస్టర్ కొట్టిన బుచ్చి బాబు తన డైరెక్షన్ లో వస్తున్న రెండో సినిమా మీద కూడా నెక్స్ట్ లెవెల్ బజ్ క్రియేట్ చేశాడు. మరి ఈ సినిమా ఎలాంటి అంచనాలను అందుకుంటుందో చూడాలి.ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ సుకుమార్ డైరెక్షన్ లో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. ఆ కథ కూడా పాన్ వరల్డ్ ఆడియన్స్ ని మెప్పించేలా చేస్తుందని అంటున్నారు.