ఢిల్లీ వరకు వెళ్లిన పెద్ది.. అందరితో ఇలా..
ఇక హీరోయిన్ జాన్వీ కపూర్ ఢిల్లీ ఎండలపై జోకులు వేస్తూనే, సినిమాలో తన క్యారెక్టర్ చాలా బోల్డ్ గా, రౌడీలా ఉంటుందని చెప్పింది.
By: M Prashanth | 29 May 2026 1:36 AM ISTజూన్ 4న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతున్న రామ్ చరణ్ 'పెద్ది' సినిమాపై అంచనాలు గట్టిగానే పెరిగిపోతున్నాయి. బుచ్చిబాబు సన డైరెక్షన్ లో, వెంకట సతీష్ కిలారు భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామా ప్రమోషన్స్ లో దాదాపు మేకర్స్ నటీనటులు అందరూ పాల్గొంటున్నారు. దేశవ్యాప్తంగా తిరిగేస్తూ పెద్ది కోసం నాన్ స్టాప్ గా బజ్ పెంచుతున్నారు. భోపాల్ లో నేషనల్ మీడియాను ఆకర్షించిన ఈ చిత్ర యూనిట్, లేటెస్ట్ గా ఢిల్లీలో ప్రెస్ మీట్ నిర్వహించి సినిమాకు సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది.
ఈ ఈవెంట్ లో రామ్ చరణ్ మాట్లాడుతూ.. ఈ సినిమా కోసం గత రెండున్నరేళ్లుగా పడ్డ కష్టం, స్క్రిప్ట్ డిమాండ్ మేరకు తాను మారిన విధానాన్ని గుర్తుచేసుకున్నారు. ముఖ్యంగా ఇందులో కుస్తీ ఫైటర్ రోల్ చేయడం తన కెరీర్ లోనే అత్యంత కష్టమైన టాస్క్ అని చెప్పారు. ప్రధాని మోదీని కలిసినప్పుడు ఆయన చెప్పిన వెస్ట్ బెంగాల్ ఫుట్ బాల్ ప్లేయర్ మహ్మద్ కథను చరణ్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఆ ఒక్క మనిషి వల్ల ఆ ఊరి నుంచి మరో 80 మంది ప్లేయర్స్ ఎలా తయారయ్యారో, మన పెద్ది కథ కూడా మారుమూల గిరిజన ప్రాంతానికి చెందిన ఒక కుర్రాడి టాలెంట్ ను, వాళ్ల గుర్తింపును ప్రపంచానికి చూపేలా ఉంటుందని చరణ్ క్లారిటీ ఇచ్చారు.
ఇక హీరోయిన్ జాన్వీ కపూర్ ఢిల్లీ ఎండలపై జోకులు వేస్తూనే, సినిమాలో తన క్యారెక్టర్ చాలా బోల్డ్ గా, రౌడీలా ఉంటుందని చెప్పింది. డైరెక్టర్ బుచ్చిబాబు సన ఆటిట్యూడ్ ని బేస్ చేసుకునే తన పాత్రను డిజైన్ చేశారని వెల్లడించింది. షూటింగ్ లో రామ్ చరణ్ ఆఫ్ కెమెరా చాలా కూల్ గా ఉంటూనే, కెమెరా ఆన్ అవ్వగానే ఎక్స్ ప్లోసివ్ ఎనర్జీ చూపిస్తాడంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. కో స్టార్ దివ్యేందు శర్మతో ఫ్లైట్ లో జరిగిన ఒక ఫన్నీ ఇన్సిడెంట్ ని కూడా ఈ సందర్భంగా జాన్వీ పంచుకుంది.
ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన నటుడు దివ్యేందు శర్మ మాట్లాడుతూ.. ఇంతమంది టాలెంటెడ్ నటీనటులతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం తనకు చాలా ఆనందాన్ని ఇచ్చిందని చెప్పారు. రామ్ చరణ్ తో కలిసి పనిచేయడం ఒక మర్చిపోలేని అనుభూతి అని, పెద్ది షూటింగ్ జ్ఞాపకాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని అన్నారు. ఈ సినిమాను అస్తిత్వం కోసం ఒక నటుడు చేసే పోరాటం అంటూ ఆయన వివరించారు.
సీనియర్ నటుడు బొమన్ ఇరాని మాట్లాడుతూ.. భారతదేశంలోని పల్లెటూళ్లలో ఎంతో టాలెంట్ దాగి ఉందని, సరైన గైడెన్స్, కోచింగ్ దొరకని అలాంటి ఎందరో ఆటగాళ్లకు ఈ సినిమా ఒక పెద్ద ఇన్స్పిరేషన్ అవుతుందని అన్నారు. ఈ సినిమా భారతీయ సినిమా చరిత్రలో నిలిచిపోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రొడ్యూసర్ వెంకట సతీష్ కిలారు మాట్లాడుతూ.. మన సంస్కృతికి అద్దం పట్టే ఇలాంటి కథతో ఇండస్ట్రీలోకి రావడం గర్వంగా ఉందన్నారు.
అలాగే ఇదొక యూనిక్ ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని, థియేటర్లలో పిల్లలకు చూపిస్తే వాళ్లకు ఒక మంచి మెసేజ్ దొరుకుతుందని చెప్పారు. జాన్వీ కపూర్, శివరాజ్ కుమార్, జగపతిబాబు, బొమన్ ఇరాని లాంటి భారీ తారాగణంతో వస్తున్న ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ అందించిన సాంగ్స్ ఆల్రెడీ చార్ట్ బస్టర్స్ అయ్యాయి. ట్రైలర్ తో నెక్స్ట్ లెవెల్ కి వెళ్లిన ఈ సినిమా.. పల్లెటూరి మట్టి వాసనతో పాటు ఒక అథ్లెట్ ప్రయాణాన్ని గ్రాండ్ విజువల్స్ తో చూపించబోతోంది. జూన్ 4న వెండితెరపై ఈ పక్కా మాస్ ఎంటర్టైనర్ ఎలాంటి వండర్స్ క్రియేట్ చేయబోతోందో చూడాలి.
