ఊర మాస్ 'పెద్ది'.. ఫస్ట్ షాట్ లో చరణ్ బెస్ట్ షాట్స్!
స్టార్ హీరో రామ్ చరణ్.. ప్రస్తుతం పెద్ది మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది.
By: Tupaki Desk | 6 April 2025 4:10 PM ISTస్టార్ హీరో రామ్ చరణ్.. ప్రస్తుతం పెద్ది మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, మీర్జాపూర్ ఫేమ్ దివ్యేందు శర్మ, జగపతిబాబు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఆస్కార్ అవార్డు విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్ సంయుక్తంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాయి. ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ లుక్ పోస్టర్స్ సూపర్ రెస్పాన్స్ అందుకున్నాయి. ఆడియన్స్ లో మూవీపై భారీ బజ్ క్రియేట్ చేశాయని చెప్పాలి.
ఇప్పుడు శ్రీరామనవమి సందర్భంగా మేకర్స్ రిలీజ్ చేసిన గ్లింప్స్ (ఫస్ట్ షాట్) వేరే లెవెల్ లో ఉందని చెప్పాలి. రిలీజ్ అయినప్పటి నుంచి సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో సందడి చేస్తోంది. ఫుల్ వైరల్ గా మారి అందరినీ ఆకట్టుకుని దూసుకుపోతోంది. పెద్ది ఫస్ట్ వీడియో గ్లింప్స్.. అదిరిపోయిందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని గ్లింప్స్ తో క్లారిటీ వచ్చేసిందని చెబుతున్నారు. చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్ వేరే లెవెల్ లో ఉందని అంటున్నారు. బుచ్చిబాబు మేకింగ్ ఒకెత్తు అయితే.. చరణ్ యాక్టింగ్ మరో ఎత్తు అని చెబుతున్నారు. రంగస్థలం చిట్టిబాబుకు మించేలా పెద్దిలో చరణ్ రోల్ ఉందని కామెంట్లు పెడుతున్నారు.
అయితే అది నిజమేనని చెప్పాలి. రామ్ చరణ్ మేకోవర్ సింప్లీ సూపర్బ్. ఊర మాస్ లుక్ లో ఓ రేంజ్ లో ఉన్నారు. ముఖ్యంగా చరణ్ యాస, భాష, డైలాగులకు అంతా ఫిదా అయిపోయారు. అదే సమయంలో ఇప్పుడు గ్లింప్స్ లోని చరణ్ లుక్ కు సంబంధించిన బెస్ట్ స్క్రీన్ షాట్స్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఎక్కడ చూసినా అవే కనిపిస్తున్నాయి.
ప్రజల్లోకి చరణ్ దూకిన సీన్.. బ్యాట్ పట్టుకుని బౌండరీ కొట్టిన మూమెంట్.. పరిగెత్తే సీన్.. ఇలా బెస్ట్ షాట్స్ అంటూ కొన్ని పిక్స్ నెట్టింట ఫుల్ గా ట్రెండ్ అవుతున్నాయి. వాటిని ఫ్యాన్స్ తమ సోషల్ మీడియా వాల్ట్స్ లో షేర్ చేస్తున్నారు. ఏదేమైనా ఫస్ట్ షాట్ తో బౌండరీ కొట్టేశారు పెద్ది మేకర్స్. సింపుల్ గా మూవీపై భారీ ఎత్తున అంచనాలు క్రియేట్ చేశారు. పెద్ది గ్లింప్స్ ఏ టు జెడ్.. అదిరిపోయిందని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు.
