'పెద్ది' టీమ్ కాన్ఫిడెన్స్ లెవల్స్ చూస్తుంటే..!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ 'పెద్ది' కి సంబంధించి ఒక క్రేజీ అప్‌డేట్ బయటకు వచ్చింది.
By: Sivaji Kontham | 1 March 2026 9:35 PM ISTమెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ 'పెద్ది' కి సంబంధించి ఒక క్రేజీ అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమా డబ్బింగ్ పనులు అధికారికంగా ప్రారంభమయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రామ్ చరణ్ ప్రస్తుతం అయ్యప్ప స్వామి మాల ధరించి నిష్టలో ఉన్నారు. అదే మాలధారణలో ఆయన డబ్బింగ్ స్టూడియోకు చేరుకోవడం విశేషం. స్టూడియోలో డైరెక్టర్ బుచ్చిబాబుతో కలిసి చరణ్ చాలా సరదాగా గడుపుతూ కనిపించారు. వీరిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యం చూస్తుంటే, సినిమా అవుట్‌పుట్ విషయంలో ఇద్దరూ చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నట్లు అర్థమవుతోంది.
స్టూడియోలో చరణ్ ఏమన్నారంటే?
డబ్బింగ్ చెబుతున్న సమయంలో రామ్ చరణ్ తనదైన శైలిలో `ఏమది..!` అంటూ చెప్పిన డైలాగ్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. ఆ డైలాగ్ డెలివరీలో ఉన్న ఇంటెన్సిటీ చూస్తుంటే, `రంగస్థలం` తర్వాత చరణ్ మరోసారి ఊరమాస్ బాడీ లాంగ్వేజ్, స్లాంగ్‌తో అలరించబోతున్నారని స్పష్టమవుతోంది. బుచ్చిబాబు సూచనలు ఇస్తుంటే, చరణ్ ఎంతో ఫ్రెండ్లీగా వాటిని ఫాలో అవుతూ కనిపించారు.
పెద్ది చిత్రానికి సంబంధించిన కీలకమైన షెడ్యూల్స్ ఇప్పటికే పూర్తయ్యాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులతో పాటు సమాంతరంగా చిత్రీకరణ కూడా తుది దశకు చేరుకుంది. ఈ సినిమా ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే ఒక ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా అని సమాచారం. ఇందులో రామ్ చరణ్ ఒక పవర్‌ఫుల్ , ఎమోషనల్ రోల్‌లో కనిపిస్తారని, ఆయన మేకోవర్ పీక్స్‌లో ఉంటుందని టాక్.
రెండో సింగిల్ రిలీజ్....
ఈ చిత్రం నుంచి రెండవ సింగిల్ `రై రై రా రా...` ను ఈ సోమవారం నాడు విడుదల చేయనున్నారు. ముఖ్యంగా ఆస్కార్ అవార్డు గ్రహీత స్వరకర్త ఎ.ఆర్. రెహమాన్ సంగీతం సమకూర్చినందున చెర్రీ అభిమానులు ఈ ట్రాక్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
డబ్బింగ్ పనులు మొదలవ్వడంతో త్వరలోనే టీజర్ లేదా ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేసి ప్రమోషన్స్ హోరెత్తించాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. పోస్ట్-ప్రొడక్షన్ పనులు షూటింగ్‌తో పాటు ఏకకాలంలో జరుగుతున్నాయి. రామ్ చరణ్ , జాన్వీ కపూర్‌లతో పాటు, ఈ చిత్రంలో శివ రాజ్‌కుమార్, దివ్యేందు శర్మ, జగపతి బాబు, బోమన్ ఇరానీ, విజి చంద్రశేఖర్ మరియు సత్య కూడా ముఖ్యమైన సహాయక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా సమర్పిస్తున్నాయి. ఏప్రిల్ చివరిలో ఈ చిత్రం విడుదల కానుంది.
