రామ్ చరణ్ 'పెద్ది'.. 45 నిమిషాలు ఆడియన్స్ అతుక్కుపోతారా?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లీడ్ రోల్ లో తెరకెక్కుతున్న పెద్ది సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
By: M Prashanth | 30 May 2026 4:09 PM ISTమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లీడ్ రోల్ లో తెరకెక్కుతున్న పెద్ది సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. విడుదల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ ఆ చిత్రానికి సంబంధించిన అప్డేట్స్, వార్తలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి. తాజాగా దుబాయ్ సెన్సార్ టీమ్ నుంచి వచ్చినట్లు ప్రచారం జరుగుతున్న కొన్ని కామెంట్స్.. అభిమానుల్లో సినిమాపై మరింత ఆసక్తి పెంచుతున్నాయి.
ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపిస్తున్న బజ్ ప్రకారం, పెద్ది సినిమా ప్రీ ఇంటర్వెల్ వరకు ఒక విధంగా సాగితే.. ఆ తర్వాత కథ పూర్తిగా మరో స్థాయికి చేరుకుంటుందట. ముఖ్యంగా ఇంటర్వెల్ తర్వాత వచ్చే ఎమోషనల్ ఎలిమెంట్స్ కథకు మెయిన్ అసెట్ గా నిలుస్తాయని ప్రచారం జరుగుతోంది. ఫ్యామిలీ రిలేషన్స్, విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఉండే ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులను కథతో మరింత కనెక్ట్ చేస్తాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అలాగే సినిమాలో రామ్ చరణ్ యాక్టింగ్ మెయిన్ అట్రాక్షన్ గా నిలుస్తుందని టాక్ వినిపిస్తోంది. తన రోల్ లోని ఎమోషన్స్ ను సిల్వర్ స్క్రీన్ పై స్ట్రాంగ్ గా చూపించారని, ఇది ఆయన కెరీర్ లో గుర్తుండిపోయే పాత్రల్లో ఒకటిగా నిలవొచ్చని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే రామ్ చరణ్ యాక్టింగ్ పై అభిమానుల్లో ఉన్న నమ్మకానికి ఆ ప్రచారం మరింత బలం చేకూర్చిందని చెప్పాలి.
అదే సమయంలో పెద్ది మూవీ క్లైమాక్స్ గురించి కూడా ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ముఖ్యంగా చివరి 45 నిమిషాలు ప్రేక్షకులకు అదిరిపోయే థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ను అందించేలా ఉంటాయని ప్రచారం జరుగుతోంది. ఎమోషన్స్, యాక్షన్, స్టోరీ ట్విస్టులు.. ఆడియన్స్ ను సీట్లకు కట్టిపడేస్తాయని అంటున్నారు. దీంతో సినిమా విడుదలకు ముందే క్లైమాక్స్ పై ఇప్పుడు ప్రత్యేక ఆసక్తి ఏర్పడింది.
అయితే రంగస్థలం తర్వాత మరోసారి స్ట్రాంగ్ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో రామ్ చరణ్ కనిపించబోతున్నారనే విషయం కూడా అభిమానుల్లో జోష్ ను పెంచుతోంది. విలేజ్ లైఫ్ స్టైల్, అక్కడి మనుషుల ఎమోషన్స్, వారి పోరాటాలను ప్రధానంగా చూపించే కథల్లో చరణ్ యాక్టింగ్ కు మంచి రెస్పాన్స్ లభించిన సంగతి తెలిసిందే. దీంతో పెద్ది కూడా అదే తరహాలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా అనే చర్చ జరుగుతోంది.
నిజానికి.. సెన్సార్ టీమ్ పేరుతో వైరల్ అవుతున్న అభిప్రాయాలు, రివ్యూలు అసలైనవిగా ట్రీట్ చేయలేమని కొందరు సినీ ప్రియులు చెబుతున్నారు. ఎందుకంటే ఇంకా మూవీ టీమ్ ధ్రువీకరించలేదు కాబట్టి. విడుదలకు ముందు ఇలాంటి ప్రచారం చాలా సినిమాల విషయంలో జరిగిన విషయం తెలిసిందే. అందుకే పెద్దిపై వినిపిస్తున్న ప్రశంసలు, అంచనాలు అభిమానుల్లో జోష్ పెంచుతున్నప్పటికీ.. సినిమా రేంజ్ ఏంటి? కథ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుంది? బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితం సాధిస్తుంది? అనే విషయాలపై విడుదల తర్వాత మాత్రమే క్లారిటీ రానుంది. కానీ ప్రస్తుతం మాత్రం పాజిటివ్ బజ్ పెరుగుతూనే ఉంది.
